వసంత శిశిరం – 1
ఒక గదిలో కొత్త పెళ్లి కూతురు అయిన శిశిర ను అందంగా అలంకరిస్తున్నారు.ఉదయమే పెళ్లి జరిగింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ పెళ్లి కూతురి ముఖంలో మాత్రం సంతోషం కనబడటం లేదు.తన బాధని పైకి కనిపించకుండా ప్రయత్నం చేస్తుంది శిశిర.
ఏదో ఆలోచన ఉన్న తనని తన ఫ్రెండ్స్ కదిపే సరికి ఈ లోకంలోకి వస్తుంది……
“ఏయ్ పెళ్లి కూతురా , దేని గురించి తెగ ఆలోచిస్తూ ఉన్నావు. ఏంటి సంగతి ” అని ఆటపట్టిస్తూ ఉంటారు తన ఫ్రెండ్స్ పూజ, రాజీ……
“ఇంక దేని గురించి ఆలోచిస్తూ ఉంటుంది వసంత్ గారి గురించే అయి ఉంటుంది. అక్కడ మీ ఆయన గారు కూడా నీ గురించే ఆలోచిస్తూ ఉంటారు. నీ వసంత్ దగ్గరకు తొందరగానే పంపిచేస్తాం కంగారు పడకు ” అని అంటుంది ప్రియ……
“అబ్బా, ఆపండి ఎందుకే అలా దాన్ని ఏడిపిస్తున్నారు, సైలెంట్ గా వచ్చిన పని చూడండి.మీ అల్లరి ఆంటి వాళ్ళు వింటే బాగోదు ” అని అంటుంది జ్యోతి (శిశిర బెస్ట్ ఫ్రెండ్)….
“నువ్వు అల్లరి చేయవు మమ్మల్ని చేయనివ్వవు కదే , దీనిని ఒక్క మాట కూడా అననివ్వవు. ఏదో సరదాగా ఇప్పుడు కాక ఇంకెప్పుడు అల్లరి చేస్తాం చెప్పు, ఈ ఒక్క రోజు మమ్మల్ని వదిలేయావే ప్లీస్ ” అని అంటారు వాళ్ళు…..
“సర్లే, ఏదో ఒకటి ఏడవండి ” అని శిశిర చేతిని పట్టుకొని పక్కన కూర్చుని ఉంటుంది జ్యోతి……
తన వైపు తిరిగి చూసి ఒక చిన్న నవ్వు నవ్వి సైలెంట్ గా ఉంటుంది శిశిర.అంతలోనే శిశిర ను తీసుకు వెళ్ళడానికి వస్తారు వాళ్ళ మేనత్త ఆమని గారు…..
“నా బంగారం ఎంత అందంగా ఉన్నావే , నా దిష్టే తగిలేటట్టు ఉంది నీకు ” అని చెవి వెనుక కాటుక పెడతారు.”రా బంగారం ముహూర్తం టైం అవుతుంది అంట మళ్లీ లేట్ అయితే నన్ను తిడతారు మీ మావయ్య “అని శిశిర ని బయటికి తీసికొని వస్తారు…..
” శిశిర అమ్మమ్మ గారి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకో “అని అంటారు ఆమని గారు…..
” అలాగే అత్త “అని నమస్కారం చేస్తుంది…..
“మళ్లీ సంవత్సరానికి నా చేతిలో ముని మనవడు ని పెట్టాలి మనవరాల, నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి ” అని అంటారు వసంత్ వాళ్ళ నాన్నమ్మ గారు…….
పైకి నవ్వి “అత్త, అమ్మ వాళ్ళు ఎక్కడ కనిపించడం లేదు” అని కంగారుగా అడుగుతుంది……
“ఇప్పుడు ఇక్కడకు అమ్మ వాళ్ళు రాకూడదు శిశిర. వాళ్ళు బయట మీ అత్తగారు వాళ్ళ తో మాట్లాడుకుంటూ ఉన్నారు” అని చెపుతుంది……
కంగారుగా “అదేంటి ఎందుకు రాకూడదు “….
” శిశిర పెద్ద వాళ్ళు వాళ్ళకి తెలిసినంత ఇదిగా మనకు తెలుసా చెప్పు, సరే పదా ఇదిగో ఈ పాలు తీసుకో “అని శిశిర చేతిలో పెడతారు…….
ఆమని గారు, శిశిర ఫ్రెండ్స్ తనని వసంత్ ఉన్న గది వైపు తీసుకు వెళ్తారు. శిశిర కు టెన్షన్ ఇంకా ఎక్కువైంది. తనని గదిలోకి తోసి ” శిశిర వెళ్లు “అని నవ్వుతూ వచ్చేస్తారు…….
చాలా సేపు డోర్ దగ్గర ఉండిపోయింది.నెమ్మదిగా తన కనులు పైకెత్తి చూసేసరికి గది మెుత్తం అందంగా పూలతో అలంకరించి ఉంది. బెడ్ మీద లవ్ సింబల్ గుర్తు వేసి చాలా నీట్ గా అందంగా ఉంది.టెన్షన్ తో చెమటలు వచ్చేస్తున్నాయి. మనసంతా అలజడి గా ఉంది.మెల్లిగా నడుచుకుంటూ వెళ్లి బెడ్ మీద కూర్చుని తన కంగారుని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది.సడన్ గా బాల్కనీ లో ఉన్న వసంత్ లోపలికి వస్తాడు. భయంగా లేచి నించుంటుంది…..
“ఫోన్ వస్తే మాట్లాడుతున్న శిశిర, చాలా సేపటి నుండి ఎదురు చూస్తున్నావ నా కోసం ” అని దగ్గరకు వస్తాడు…..
కంగారు పడుతూ “ప.. పాలు అండి ” అని చెప్పి చేతికి ఇస్తుంది……
“పాలు తర్వాత తాగుదాము లే కాని రా కూర్చో, ఎంత సేపు అలా నుంచుని ఉంటావు . అయిన నేను రాగానే లేవాలి అని రూల్ ఉందా కూర్చో ” అని పాలు పక్కన పెట్టి బెడ్ మీద కూర్చుంటాడు…….
కూర్చోనేది ఆగిపోతుంది. “ఏమైంది శిశిర, కూర్చో ఎందుకు ఆగిపోయావు ” అని అడుగుతాడు…..
“ఏవండి , మీ కాళ్లకు దణ్ణం పెట్టాలి. ఒక సారి నించుటార ” అని తల కిందకి ఉంచే అడుగుతుంది….
“ఏంటి, కాళ్లకు దణ్ణం పెడతావ, నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు శిశిర. అయిన ఏదో పాత కాలం దానిలా ఇంకా ఏంటి, అలాంటివి ఏమి వద్దు కాని కూర్చో ” అని అంటాడు…..
“అది మరి అమ్మమ్మ గారు చెప్పారు అండి, భర్త కాళ్లకు దణ్ణం పెట్టాలి అని అందుకే ” అని అంటుంది సేమ్ పొజిషన్ లో ఉండి చెపుతుంది……
“మా ముసలి పాప అలాగే చెపుతుంది లే కాని, నువ్వు ఇప్పుడు కూర్చుంటావ లేక నన్ను నించోమంటావ చెప్పు మరి ” అని అంటాడు……
“అయ్యో, వద్దు అండి నేనే కూర్చుంటా అని కూర్చుని నేను మీతో ఒక విషయం మాట్లాడాలి ” అని తడబడుతూ చెపుతుంది……
“చెప్పు ఏంటి ఏం మాట్లాడాలి నాతో ” అని దగ్గరకు వచ్చి శిశిర చేతిని పట్టుకుంటాడు. ఒక్క సారి గా లేచి చేతిని లాగేసుకుంటుంది……
“నాకు కొంచెం టైం కావాలి అండి, నేను అప్పుడే దీనికి సిద్ధంగా లేను. ప్లీస్ అండి అర్థం చేసుకోండి ” అని ఏడుస్తూ చెపుతుంది……
“ఏయ్ శిశిర ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు, సరే నీకు ఇష్టం లేదు అంతే కదా, నేను ఏమి నిన్ను ఫోర్స్ చేయను. అయిన నాకు కూడా టైం కావాలి, నేను కూడా సిద్ధంగా లేను లే, నువ్వు కంగారు పడకుండ హ్యాపీగా నిద్రపో ” అని బెడ్ దిగి సోఫా వైపు నడుస్తాడు…….
“ఏవండి , మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు ” అని అడుగుతుంది…….
“నేను సోఫా లో పడుకుంటాను శిశిర, నీకు ఇబ్బంది ఎందుకు చెప్పు, నువ్వు పడుకో “
“అయ్యో, అదేంటి మీరు బెడ్ మీద పడుకోండి. నాకేం ఇబ్బంది లేదు,మీరు ఇబ్బంది పడుతుంటే నేను సోఫా లో పడుకుంటాను ” అని అంటుంది శిశిర…..
నాకు ఇబ్బంద అనుకొని “అదేం లేదు లే “అని బెడ్ మీద పడుకుంటాడు. కొంపదీసి ఈ మేడమ్ ఎవరినైనా లవ్ చేసిందా అందుకే ఇలా అంటుందా అని మనసులో అనుకుంటాడు……
” నేను ఆయనని బాధ పెడుతున్న కదా”అని తనకి గిల్టి గా ఉంటుంది.రెండు రోజుల నుంచి సరిగా నిద్ర లేక వెంటనే నిద్ర లోకి జారుకుంటుంది శిశిర. నిద్ర లో తెలియకుండనే వసంత్ వైపు తిరిగి పడు కుంటుంది…..
“నాకు నిద్ర లేకుండ చేసి నువ్వు హాయిగా పడుకున్నావ బుజ్జి ” అని అనుకొని తనని చూస్తూ ఎప్పటికో నిద్ర పోతాడు…….
కథ కొనసాగుతుంది….
స్టోరీ ఎలా ఉందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి….
బాయ్
మీ లావణ్య…..
Swipe left/right or tap the sides to turn pages