ఆర్య జుట్టు పీకుతున్న కూడా అతనిలో ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో వీడు అసలు మనిషే నా ..? అని అనుకుంటూ ఉంది.సరిగ్గా అలా అనుకున్న రెండు నిమిషాలకు
” అమ్మా … ” అంటూ గావు కేక పెట్టింది పాప.
ఈ రెండు నిమిషాల్లో ఏం జరిగింది అంటే …. ఆర్య అసలు మనిషే నా అని అనుకుంటూ … మనసులోనే ముందు రోజు నైట్ బలవంతంగా లవ్ యూ టూ చెప్పించుకున్న విషయం గుర్తు చేసుకుంటూ…
ఆర్య మిద కారాలు మిరియాలు నూరుతు .. చూసుకోకుండా షాంపూ నురుగు మిద కాలు వేసి స్లీప్ అయ్యి జారి కింద పడబోయింది.
అక్కడే ఉన్న ఆర్య బాబు రూప కింద పడకుండా పట్టుకున్నాడు కానీ … రూప కాలు స్లీప్ అవ్వడంతో కింద పడింది ఏమో అని అనుకొని అమ్మ అని గావు కేక పెట్టీ ..