New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
వేచానయ్య నీకోసం 🤍 – 1

వేచానయ్య నీకోసం 🤍 – 1

వేచానయ్య నీకోసం 
చమట చుక్కలు ముత్యపు జల్లుల్లాగా నేల మీదకి జారిపోతున్నాయి… మరొకవైపు కౌంటింగ్ టైం అయిపోతుంది….
ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కమిషన్ అండర్ లో జరుగుతున్న కాంపిటీషన్ అది…. దేశ విదేశాల నుంచి ఎంతోమంది ప్లేయర్స్ రకరకాల గేమ్స్ లో పాటిస్పేట్ చేయడం కోసం వచ్చారు….
నుదుటి మీద పట్టిన చెమట హర్ష్గా తుడిచేసుకుని కాలితో తన కాలి దగ్గర ఉన్న బాల్ ఒక్క తన్ను తన గాని అది వెళ్లి బాస్కెట్లో పడిపోయింది…
ఆపోజిట్ టీం కంటే వీళ్ళకి 5 పాయింట్స్ ఎక్కువగా ఉండడంతో వీళ్ళ టీం విన్ అయ్యేసరికి అందరూ అతన్ని ఎత్తుకొని జయజయ ద్వానాలు చేస్తూ ఉంటే అతను పెద్దగా రియాక్ట్ అవ్వకుండా ఫ్రెష్ అవ్వడానికి వెళ్లిపోయాడు….
పది నిమిషాల్లోనే స్టైలిష్ డ్రెస్సింగ్ లోకి చేంజ్ అయిపోయి బయటికి వెళుతున్న అతని దగ్గరికి పరిగెత్తుకొచ్చి “మన వాళ్ళందరూ పార్టీ అడుగుతున్నారు…. పదరా పోదామని” వాళ్ళ టీంలో తనకి బాగా క్లోజ్ ఇంకా బెస్ట్ ఫ్రెండ్ అయినా సాత్విక్ పరుగులు పెట్టుకుంటూ వచ్చాడు…..
పాకెట్ లో ఉన్న సిగరెట్ తీసి వెలిగించుకుంటూ “నాట్ ఇంట్రెస్టెడ్” అని చెప్పి అతను బయటికి వెళ్లడంతో “వీడొకడు…. గేమ్ ఇంత బాగా ఆడతాడు గాని రోబో కి ఎక్కువ మనిషికి తక్కువ” అని తల పట్టుకున్నాడు సాత్విక్…
*******************
అతను ఇంటికి వచ్చేసరికి తండ్రి గంభీరంగా సోఫాలో కూర్చుని తాతగారితో ఏదో మాట్లాడుతూ ఉంటే వాళ్లతో మాట్లాడకుండా వెళ్ళబోతు ఉంటే “ఆర్యన్” అని వినిపించిన తండ్రి గంభీరమైన గొంతుకు వెనక్కి కూడా తిరగకుండా రెక్లెస్ గా నిలబడ్డాడు ఆర్యన్….
“పెద్దవాళ్లు కూర్చున్నప్పుడు పలకరించాలని ఎన్ని సార్లు చెప్పాలి నీకు?” అన్నాడు తండ్రి జగన్నాథ్…..
ఆర్యన్ అప్పుడు కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా గదిలోకి వెళ్ళడంతో జగన్నాథ్ ఏదో ఆనబోతుంటే “ఉడుకు రక్తం జగన్నాథ్…. మగ పిల్లాడిని అలా ప్రతిక్షణం గమనిస్తూ ఉండకూడదు” అన్నాడు ఆర్యం తాతయ్య విశ్వనాథ్….
“మనిద్దరం అంటే పర్వాలేదు నాన్నగారు… ఇలాగే బయట వాళ్ళు పెద్దమనుషులు ఎవరైనా వచ్చినప్పుడు పలకరించకపోతే మన పెంపకాన్ని తప్పు పడతారు” అన్నాడు జగన్నాథ్…..
“వాళ్ళు ఎవరు నా కొడుకు గురించి మాట్లాడడానికి… అలాంటి వాళ్ళని మీరు ఇంటికి పిలవాల్సిన అవసరం లేదని” వంటగదిలో నుంచి బయటికి వచ్చిన కావేరి జగన్నాథ్ కి కాఫీ ఇస్తూ చెప్పింది….
“కావేరి” అని జగన్నాథ్ కోపంగా ఏదో అనబోతు ఉంటే “తల్లికి కొడుకు అంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది… అలా అంటే మీ అమ్మకి కూడా నీ మీద ప్రేమ చాలా ఎక్కువ… నువ్వు కాలేజ్ ఎగ్గొట్టి సినిమాలకి షికారులకి తిరుగుతూ ఉంటే ఒక దెబ్బ కూడా వేయకుండా మీ అమ్మ చూసుకునేది…. ఇప్పుడు తన కొడుకుని కోడలు అలాగే చూసుకుంటుంది” అన్నాడు విశ్వనాథ్….
“నాన్న!!!! నేను కనీసం ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నాను కానీ వీడేమైపోతాడో నాకు అర్థం కావడం లేదని” జగన్నాథ్ అంటూ ఉంటే “నా మనవడిది మహా జాతకం…. వాడు కచ్చితంగా ఒకరోజు ప్రయోజకుడు అవుతాడని” విశ్వనాధ్ చెప్పడంతో ఇక తండ్రి మాటకి మరొక మాట ఎదురు చెప్పలేక జగన్నాథ అసహనంగా వెళ్ళిపోతే “కాఫీ తీసుకోండి మావయ్య గారు” అని చెప్పింది కావేరి….
“మీ అత్తయ్య ఎక్కడ… ఉదయం లేచినప్పటి నుంచి కనిపించడం లేదని” విశ్వనాధ్ అడిగేసరికి “ఉదయాన్నే గుడికి వెళ్ళింది మావయ్య గారు…. అక్కడి నుంచి వదిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్తానని చెప్పింది” అంది కావేరి….
సరే అని చెప్పి విశ్వనాథ్ కాఫీ తాగుతూ ఉండడంతో కావేరి వంట గదిలోకి వెళ్లిపోయింది….
ఆర్యన్ అసహనంగా గదిలోకి వెళ్లి అక్కడ జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుని రావడంతో ఫ్రెష్ గా స్నానం చేసి బయటకు వచ్చి మొబైల్ చూసుకుంటూ బెడ్ మీద కూర్చున్నాడు….
తను గెలవడం చూసి ఎంతోమంది అమ్మాయిలు తన ఫేస్బుక్ పేజ్ దగ్గరికి వచ్చి మెసేజెస్ చేయడానికి ట్రై చేస్తుంటే ఇది కొన్ని సంవత్సరాలుగా అతనికి అలవాటు కావడంతో ఎవరికి రిప్లై ఇవ్వకుండా ఏదో హారర్ మూవీ పెట్టుకొని చూస్తూ ఉండిపోయాడు….
ఒక గంట తర్వాత అతనికి ఫోన్ కాల్ రావడంతో లిఫ్ట్ చేసిన అతనికి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అండ్ సొసైటీ నుంచి కాల్ రావడంతో “ఇస్ థిస్ ఇస్ ఆర్యన్” అని వినిపించడం గొంతుకి “ఎస్ థిస్ ఇస్ ఆర్యన్” అన్నాడు అతను…
మేము ఫలానా అసోసియేషన్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి “మీ ఫుట్బాల్ ప్లేయింగ్ స్కిల్స్ మాకు బాగా నచ్చాయి పైగా మీ ట్రాక్ రికార్డు కూడా చాలా బాగుంది…. ఒక సిక్స్ మంత్స్ లో జరగబోయే వరల్డ్ ఫుట్బాల్ కాంపిటీషన్లో 10 టాలెంటెడ్ గ్రూప్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలనీ ట్రై చేస్తున్నాం… సో ఇన్ దిస్ ప్రాసెస్ వి గాట్ టు నో అబౌట్ యు…” అన్నాడు….
ఆర్యన్ పెద్దగా ఎక్సయిట్ అవ్వకుండా వాళ్ళు చెప్పేది వింటూ ఉంటే “మీకు ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం ఇష్టం ఉంటే రేపు ఆఫీస్ కి వచ్చి దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని వెళ్ళచ్చు” అన్నాడు….
“ష్యూర్!!” అని చెప్పి ఫోన్ కట్ చేశాడు ఆర్యన్….
*******************
“అమ్మ గాయత్రి” అని వినిపించిన అమ్మమ్మ పిలుపుకి “వస్తున్నాను అమ్మమ్మ” అని దూడపిల్లతో ఆడుతున్న 22 ఏళ్ల అమ్మాయి గజ్జల సవ్వడి చేసుకుంటూ ఇంట్లోకి పరిగెత్తుకొచ్చింది….
“తాతయ్యతో మాట్లాడడానికి ఊరి పెద్ద మనుషులు వచ్చారు…వాళ్ళందరికీ ఈ కాఫీ ఇవ్వు” అంటూ వేడివేడి ఫిల్టర్ కాఫీలు ఉన్న స్టీల్ గ్లాసులు అందించడంతో అవన్నీ తీసుకుని వెళ్లి వాళ్ళకి అందించింది గాయత్రి….
కంటిన్యూస్!!!!