ఏయ్ నీకు ఎలా కనిపిస్తున్నాను అబ్బాయి అని అడుగుదామనుకున్నాను కానీ అదేంటో ఆ కళ్ళల్లోకి చూస్తే భయము విడియేమో ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది అందుకే సైలెంట్ అయిపోయాను.
కానీ కృష్ణమ్మ మాత్రం నా కళ్ళల్లో నుండి అస్సలు ఆగనంటోంది అందుకే పోయి పక్కన చైర్ లో కూర్చున్నాను బహుశా అది ఫుడ్ కోర్ట్ ఏమో ఎప్పుడో ఒక సంవత్సరం కిందట వచ్చినట్లు గుర్తు అదే మాల్కి.
అంత మాటలు అన్నాడు మళ్ళీ నా ఎదురుగా వచ్చి కూర్చోవటం అవసరమా అని నేను అనుకుంటూ ఇప్పుడు అదే మాట నేనంటే అమ్మాయి ఒంటరిగా దొరికింది అడ్వాంటేజ్ తీసుకోవాలనుకునే ఇప్పుడు వచ్చిన ఎదురుగా కూర్చున్నావా అని నేనంటే ఇంకేం లేదు ఎస్కలేటర్ మీద నుండి నన్ను తోసేసిన తోసేస్తాడు మహానుభావుడు అనుకుంటూ సైలెంట్ గా ఉంటే ఐస్ క్రీమ్ కప్ వచ్చి నా ముందు నిలిచ్చుకొని తిను అంటూ డాన్స్ వేసింది.
పైన నట్స్ తో చాలా టెంప్టింగ్ గా ఉంది తినకుండా ఉండలేకపోయాను ఎవరు ఆర్డర్ చేసి ఉంటారు ఇది నా ముందుకు వచ్చిందబ్బా అని తలెత్తి చూడగానే ఆ మహానుభావుడు ఇంకా నా ఎదురుగానే ఉన్నాడు సర్లే వదిన ఏమైనా పంపించింది లేకపోతే మనకోసం ఎవరో మానస చోరుడు నన్ను చూస్తూ నా ఇష్టాలను తెలుసుకొని పంపిస్తాడా ఏంటి తీస్తే వదిన లేదంటే బావ ఎవరో ఒకరు పంపించాలి అనుకుంటూ శుభ్రంగా స్పూన్ తో కప్పు నాకేసాను.
అరే తింటున్నంతసేపు అటు ఇటు చూసుకొనేమో నేను నా మతిమరుపు మండ నా పిచ్చివి తగలెయ్య ఇప్పుడు కప్ అయిపోయాక ఎదురుగా చూస్తే ఆయన గారు లేరు ఇంతలో వెయిటర్ వచ్చి మేడం బిల్ అంటూ టేబుల్ మీద పెట్టేసి పోయాడు బిల్ పేపర్స్ తెచ్చుకున్నాను అంటే లేదు నా ఫోన్లో ఫోన్ పే ఉంది కానీ అందులో నాకు తెలిసి ఒక 20 రూపాయలు 30 చూస్తే భయపడుతూ ఉండి అటు ఇటు చూస్తూ ఉంటే నా కళ్ళకి ఎవరూ కనిపించలేదు.
ఈ పెద్ద మనిషి ఇక్కడే ఎక్కడో ఉండాలి కదా అంతలోనే ఎటుపోయాడు అని నేను చూస్తూ ఉంటే అసలు కనబడలేదు అయ్యో ఇప్పుడు నేను ఎలా అని అనుకుంటూ ఉంటే పది నిమిషాల్లోనే ఆ వెయిటర్ మళ్ళీ వచ్చి మేడం ఇంకా ఏమైనా తీసుకుంటారా అని అడుగుతూ ఉంటే ఉండవయ్యా తిన్న ఐస్ క్రీమ్ ఎలా కట్టాలని నేను ఆలోచిస్తూ ఉంటే అని అనుకుంటూ నా మతిమరుపును నా బుద్ధి తక్కువ తనని ఏమనాలో నాకే తెలియలేదు చేతిలో ఫోన్ ఉండి కూడా వదిన బావల ఎవరికో ఒకరికి కాల్ చేయొచ్చు కదా అని ఐడియా రాగానే వెంటనే ఫోన్ నొక్కాను. నా కర్మ కాలిపోయిన టైం ఎలా ఉంటుందంటే నా ఫోన్లో రీఛార్జ్ కూడా అప్పుడే అయిపోయింది!!