❤️ మిస్టర్ ప్రవరాఖ్య – మిస్ వరూధిని ❤️ – 4
అశోక్ గారు వరూధిని బాధను చూసి, ఆయన మనసు కూడా బాధతో నిండిపోతుంది.
వరూధిని తన బాధ నుంచి తేరుకొని, సాయంత్రం రిక్కీ కోసం స్పెషల్గా స్నాక్స్ ప్రిపేర్ చేస్తుంది.
చిన్న రిక్కీని బయటికి తీసుకెళ్లి, బ్రతిమిలాడి చాక్లెట్స్, ఐస్‌క్రీమ్ ఇప్పించి ఇంటికి తీసుకొస్తాడు.
దాంతో రిక్కీ కూల్ అయ్యి, సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఐస్‌క్రీమ్ ఫినిష్ చేస్తాడు.
వరూధిని ఐస్‌క్రీమ్ తింటున్న రిక్కీ దగ్గరికి వెళ్లి, “ఐస్‌క్రీమ్ తింటే…” అంటుండగానే, చిన్న వరూధిని చెయ్యి పట్టుకుని ఆపేసి పక్కకు తీసుకొచ్చి,
“అక్కా, ఇప్పుడు నువ్వు ఏమీ అనకు. రిక్కీని బ్రతిమిలాడి ఇంటికి తీసుకొచ్చేసరికి నా తలప్రాణం తోకకు వచ్చింది. ఇప్పుడు నువ్వు ఏమైనా అంటే మళ్లీ అలిగి కూర్చుంటాడు. ప్లీజ్ అక్కా!” అంటూ చిన్న బ్రతిమిలాడడంతో,
వరూధిని కూడా ఇక ఏమీ అనలేక సైలెంట్‌గా ఉండిపోతుంది.
*************
రుద్రవీర్ సింహా మెన్షన్ దగ్గరికి వచ్చేసరికి రాత్రి 9 గంటలు అవుతుంది.
ఆ ఇంటి పెద్ద అయిన చంద్రకాంత్ సింహా గారు రుద్రవీర్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు.
ఆయన ఎదురుచూపులకు ఫలితంగా కారు పోర్టికోలోకి వచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఆరడుగుల ఎత్తు, ఫిట్ బాడీ, ఎవరినైనా తన చూపులతోనే భయపెట్టగల షార్ప్ లుక్స్‌తో రుద్రవీర్ లోపలికి నడుచుకుంటూ వస్తాడు.
లోపలికి అడుగుపెట్టగానే ఎదురుగా చంద్రకాంత్ గారిని చూసి, ఆయన దగ్గరికి వచ్చి,
“ఇంకా పడుకోలేదా తాతయ్య? ఇంత టైం అవుతున్నా ఏం చేస్తున్నారు?” అని బేస్ వాయిస్‌తో అడుగుతాడు.
చంద్రకాంత్ గారు, “రుద్రా, నీతో కొంచెం మాట్లాడాలి” అంటారు.
“ఏదైనా ఇంపార్టెంట్ విషయమా, తాతయ్య?” అని రుద్రవీర్ అడగగానే,
“ఇంపార్టెంటే! కాకపోతే నువ్వు ముందు వెళ్లి ఫ్రెష్ అయ్యి రా. భోజనం చేస్తూ మాట్లాడుకుందాం” అంటారు.
రుద్రవీర్ మెట్లు ఎక్కుతూ తన రూమ్‌కి వెళ్లి, పది నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు.
చంద్రకాంత్ గారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. రుద్రవీర్ ఆయన దగ్గరికి వచ్చి కూర్చుని,
“మీరు ఇంకా భోజనం చేయలేదా తాతయ్య? ఇలా అయితే మీ హెల్త్ ఏమవుతుంది? అయినా ఇంతసేపటి నుంచి ఏం చేస్తున్నారు? మీకు భోజనం పెట్టకుండా…” అంటూ అరుస్తున్న రుద్రవీర్ చెయ్యి పట్టుకుని ఆపేస్తారు చంద్రకాంత్ గారు.
“రుద్రా, కొంచెం శాంతంగా ఉండు. నేనే నీ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను” అంటారు.
సరే తాతయ్య అంటూ రుద్రవీర్ ప్లేట్‌లో రెండు చపాతీలు, పన్నీర్ కర్రీ వడ్డిస్తాడు ఒక మేడ్ వచ్చి తినడం మొదలుపెడతాడు. రుద్రవీర్ .
చంద్రకాంత్ గారి ప్లేట్లో ఆయనకు స్పెషల్గా ప్రిపేర్ చేసిన భోజనం వడ్డించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ మేడ్ .
“ఇప్పుడు చెప్పండి” తాతయ్య అనగానే,
చంద్రకాంత్ గారు భోజనం చేస్తూ, “రుద్రా, నువ్వు కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది వినాలి” అంటారు.
“చెప్పండి తాతయ్య” అంటూ కూల్‌గా అడుగుతాడు.
“ఈరోజు మీ నాన్నకి ట్రీట్‌మెంట్ చేయడానికి ప్రతిరోజూ వచ్చే డాక్టర్ ప్లేస్‌లో ఒక అమ్మాయి వచ్చింది” అని చెప్పగానే,
రుద్ర కోపంగా, “ఏంటి? ఒక అమ్మాయి వచ్చిందా? అసలు తనని ఇంట్లోకి ఎవరు రానిచ్చారు ? నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఆడవాళ్లు కాలు పెట్టకూడదని స్ట్రిక్ట్‌గా చెప్పానుగా! మరి నాకు తెలియకుండా ఎవరు తనని లోపలికి రానిచ్చారూ?” అంటూ కోపగించుకుంటాడు.
చంద్రకాంత్ గారు, “రుద్రా, ఆవేశపడకు. కొంచెం నేను చెప్పేది విను” అనగానే,
రుద్రవీర్ తన కోపాన్ని అనుచుకొని”చెప్పండి తాతయ్య” అంటాడు.
“ఈరోజు ఆ అమ్మాయి ట్రీట్‌మెంట్ చేస్తుంటే నాకు ఒక నమ్మకం వచ్చింది. ఇన్ని రోజులు వచ్చిన వాళ్లందరూ ఏదో వాళ్ల డ్యూటీ చేసి వెళ్లిపోయేవాళ్లు. కానీ ఈరోజు వచ్చిన అమ్మాయి చాలా శ్రద్ధగా ట్రీట్‌మెంట్ చేసింది. ఈరోజు మీ నాన్న నేను మాట్లాడిన మాటలకు స్పందించినట్టుగా అనిపించింది.
నిన్ను నేను ఎప్పుడూ ఏమీ అడగలేదు రుద్రా. మొదటిసారి నా కొడుకు కోసం, వాడు మళ్లీ మామూలు మనిషిలా తిరగడం కోసం. నేను బ్రతికుండగానే అది జరగాలని నిన్ను కోరుకుంటున్నాను.
నీ పంతాన్ని పక్కన పెట్టి, ఒక్కసారి నా కొడుకు ప్రాణాల కోసమైనా ఆ అమ్మాయిని ప్రతిరోజూ వచ్చి మీ నాన్నకు ట్రీట్‌మెంట్ ఇచ్చేలా నువ్వు చేయాలి. ఇది తప్ప నేనేమీ అడగను.
నువ్వు ఇంతవరకు తీసుకున్న నిర్ణయాల్లో దేనికీ నేను అడ్డు చెప్పలేదు. నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండిపోతానన్నా కూడా నేను నీకు అడ్డు చెప్పలేదు. కానీ నా కొడుకు విషయంలో మాత్రం ఈ చిన్న హెల్ప్ నాకు చేయి. ఇంతకుమించి నిన్ను నేను ఏమీ అడగను” అంటూ ఆయన కళ్లలో నీళ్లు తిరుగుతుండగా రుద్రవైపు చూస్తూ అడుగుతారు.
“తాతయ్య, మీరేం మాట్లాడుతున్నారు అసలు? నాకు ఆడవాళ్లను చూస్తేనే అసహ్యం. అలాంటిది ఒక అమ్మాయిని ఈ ఇంట్లోకి రానిస్తానని ఎలా అనుకున్నారు? కావాలంటే అంతకంటే బెస్ట్ డాక్టర్‌ని నేను వెతికి తీసుకొస్తాను. మీరు నా మాట నమ్మండి. కచ్చితంగా నాన్న కోలుకుంటారు. మీరు దాని గురించి టెన్షన్ పడకండి” అంటాడు.
దానికి చంద్రకాంత్ గారు, “నువ్వు నేను ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు ఏంటి రుద్రా? ఈ ఒక్క సహాయం చేయి. నిన్ను నేను అర్థిస్తున్నాను” అంటారు.
“తాతయ్య, ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు మీరు ఆర్డర్ వేయాలి కానీ, అర్థించకూడదు. నాకు కొంచెం టైం కావాలి. నేను ఆలోచించుకుని చెబుతాను” అంటూ అక్కడి నుంచి లేచి, హ్యాండ్ వాష్ చేసుకుని పైకి వెళ్లిపోతాడు.
చంద్రకాంత్ గారు భోజనం ఫినిష్ చేసి, రఘునందన్ గారి దగ్గరికి వెళ్తారు. ఆయన పక్కన కూర్చుని చెయ్యి పట్టుకుని,
“రఘూ, నువ్వు మళ్లీ మామూలు మనిషివి అవుతావు. ఆ అమ్మాయి నిన్ను కచ్చితంగా మామూలు మనిషిగా చేస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. నీ కొడుకు దీనికి ఒప్పుకుంటే నాకు ఏ దిగులూ ఉండదు” అంటూ ఆయన కొద్దిసేపు రఘునందన్ గారితో మాట్లాడి, తన గదికి వెళ్లిపోతారు.
To be connected
Swipe left/right or tap the sides to turn pages