చూపులు కలిసిన వేళ – 4
“ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య…? బాబు మాట్లాడడం రాకపోవడం ఏంటి…? అయినా ఆ బాబు ఎవరు…? మీకేమవుతారు?” అసహనంగా అడిగాడు సిద్ధు. “బాబు… అది మా పెద్ద అమ్మాయికి పుట్టిన బాబు వీడు…!” “అంటే మీరు అన్నది…?” అనుమానంగా అడిగాడు సిద్ధు. “హా… అవును బాబు. నాకు ముగ్గురు అమ్మాయిలు. వీడు నా పెద్ద కూతురు కొడుకు బాబు…!” “డాడ్… మీకు ఇద్దరు అమ్మాయిలు అని చెప్పారు…?” “మీ నాన్నగారు చెప్పింది నిజమే బాబు. ప్రస్తుతానికి ఇద్దరే కూతుళ్లు. […]