New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

రాక్షసప్రేమ

51 stories Ongoing Romance Suspense Family Drama

రాక్షస ప్రేమహైదరాబాద్ హైకోర్టులో  లోపల చెట్టు కింద అరుగు మీద ఒక అమ్మాయి చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా కూర్చుని ఉంది. ఆమె పక్కన ఉన్న ఆమె తల్లి పూజిత భయపడుతూ "శౌర్య ఇప్పుడు ఈ కోర్టు కేసులు ఇవన్నీ ఎందుకే కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా..! అని అన్నది.."అమ్మ కూర్చుని మాట్లాడుకునేంత మేటర్ అక్కడ లేదు. కోర్టులోనే తేల్చుకోవాలి. ఇక నాకు ఓపిక సహనం లేదు. ఇప్పటికే నేను చాలా ఆలస్యం చేశాను అని లేటుగా నాకు అర్థం అయింది.  ఇప్పుడు కన్నీళ్లు కార్చటానికి నా కంట్లో కన్నీరు కూడా లేవు.. ఇంకిపోయాయి..ఇక చాలా నా బ్రతుకేదో నేను బ్రతకాలి అనుకుంటున్నాను జరిగిన దాని గురించే తలుచుకుంటూ ఆ ఇంటిలో ఆ వ్యక్తి పక్కన…

Browse Stories

రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 6

రాక్షసప్రేమ-6   శౌర్య పేరులోనే ధైర్యం ఉంది ఆ ధైర్యం నిన్ను ఎంతవరకు తీసుకొని వెళ్తుందో నేను చూస్తాను.. కానీ రౌద్ర నాలో ఉన్న రాక్షసుడిని నేను బయటకు తీస్తే నువ్వు తట్టుకోలేవు ఎందుకే నీకు ఈ కష్టాలు హ్యాపీగా నాతో పాటు మన ఇంటికి వచ్చేస్తే నా పెళ్ళాంగా జీవితాంతం సంతోషంగా బ్రతికేయొచ్చు. కానీ ఆ సంతోషం నాకేమీ వద్దు అంటూ ఇదిగో ఇలా విడాకులు అంటూ కేసు కోర్టు అని తిరుగుతూ నన్ను కూడా […]

6 min 190 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 7

రాక్షసప్రేమ-7     “ఏంటే నేను తగ్గి నీ దగ్గరకు వచ్చి ఇలా అడుగుతున్నాను అని చాలా ఎక్కువ చేస్తున్నావ్. నేను ఏదైనా ఒక్కసారి అడుగుతాను రెండోసారి అడగను” అని అతడు సీరియస్ గా చెప్పి  బెడ్ దిగి ఆమె దగ్గరకు వస్తుంటే    “వద్దు నువ్వు నా దగ్గరకు రావద్దు నా దగ్గరకు వచ్చి నన్ను టచ్ చేసావంటే నన్ను నేను ఏదైనా చేసుకోవడానికి వెనకాడను, నాకు ఎలాగూ ఈ జీవితం మీద ఆశ చచ్చిపోయింది […]

6 min 128 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 8

రాక్షసప్రేమ-8       రౌద్ర శౌర్యాన్ని ఏం చేస్తున్నాడో అన్న భయం వాళ్ళని ఒక్క క్షణం కూడా కుదురుగా ఉండనివ్వలేదు  గుండె ఆగి కొట్టుకుంటే ఎలా ఉంటుందో వాళ్ళ పరిస్థితి అలానే ఉంది. శౌర్యని కాపాడడానికి రౌద్ర కి ఎదురు వెళ్లలేరు ఎదురు వెళితే వాళ్ళని కూడా నిర్ధాక్షణంగా చంపేస్తాడు అయినా వాళ్ళు చావుకి భయపడటం లేదు శౌర్యాన్ని బ్రతికించాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళు రౌద్ర దగ్గరకు వెళ్లి అతడిని ఆపి శౌర్యాన్ని కాపాడితే ఆ […]

6 min 120 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 9

రాక్షస ప్రేమ-9     రౌద్ర ఆమె ఎంత నెడుతున్నా గోర్లతో గిచ్చుతున్న ఆమెను మాత్రం వదిలిపెట్టకుండా అంతే ఫేస్ ని తన చేతుల్లోనే ఉంచుకొని  ఇష్టంగా ఆమెకు ముద్దు పెట్టాడు.    అతడు నుంచి తను విడిపించుకోలేదు అని తెలిసినా కూడా ప్రయత్నించి ప్రయత్నించి ఓడిపోయింది, అప్పటికే అతడి రాక్షసత్వానికి గుర్తుగా ఆమె కళ్ళ వెంట కన్నీరు ఆగకుండా గంగా నదుల ప్రవహిస్తూనే ఉంది..   ఐదు నిమిషాల తర్వాత అతడు అమెని వదిలిపెట్టి తన […]

6 min 118 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 10

రాక్షసప్రేమ-10   రూమ్ లోకి వచ్చిన విరాట్ బాధగా బెడ్ మీద కూర్చుని తన భార్యను తన పక్కనే కూర్చోబెట్టుకుని ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకొని నేను నా స్వార్థం కోసం ఆలోచించడం వల్లే కదా ఇలా శౌర్య జీవితం అయిపోయింది రౌద్రా కూడా మరీ ఇంత మొండిగా బిహేవ్ చేస్తున్నాడు రాక్షసంగా తయారయ్యాడు నా స్వార్థం వల్లే కదా అని అన్నాడు..   “కరెక్ట్ గా మీ స్వార్థం అని చెప్పలేను, మీరు స్వతంత్రం […]

6 min 110 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 11

రాక్షసప్రేమ-11     “హా పెళ్లి చేసుకుందామని తీసుకొని వెళుతున్నాను” అని శౌర్య వెటకారంగా చెప్పడంతో, అప్పటివరకు ఉన్న కోపం అంతా కూడా దూదిపింజలా ఎగిరిపోయి నిజంగానా అని తన చేతిలో ఉన్న బాల్ ని తన టీమ్ మెట్ అయిన విజయ్ కి క్యాచ్ వేసి తను శౌర్య భుజం చుట్టూ చేతిని వేసే దగ్గరకు లాక్కొని “ఏ గుడికి వెళ్దాం” అని సరదాగా అడిగాడు.    “గుడికి కాదు చర్చికి వెళ్దాం” అని మూతి […]

6 min 104 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 12

రాక్షసప్రేమ-12     “నేను చేసే పని నీకు నచ్చుతుందో లేదో తెలియదు విరా.. నువ్వు నన్ను తిట్టినా కొట్టినా కచ్చితంగా నాతో కలిసి ఉంటావు అని నమ్మకం నాకు ఉంది. నువ్వు మా పేరెంట్స్ కి మా ఫ్యామిలీకి దూరంగా ఉంటేనే సంతోషంగా ఉండగలవు. అంతకుమించి నా ఫ్యామిలీతో కలిసి ఉండటం నాకే ఇష్టం లేదు” అని తను చేయాలి అనుకున్న పనిని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనేది అన్ని ఆలోచిస్తూ ఉన్నాడు విరాట్.. […]

6 min 96 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 13

రాక్షస ప్రేమ -13     “రేయ్ పెళ్లి చేసుకోమంటే ఇప్పుడే కాదు నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తావ్ ఏంటి రా..? ఎవరైనా ఈ మాటలు విన్నారు అంటే నువ్వు మగాడివేనా అని అడుగుతారు. పెరుమాళ్ళ వంశంలో పుట్టి ఇంకా పెళ్లి చేసుకోవడానికి ఆలోచిస్తావేంట్రా..? త్వరగా పెళ్లి చేసుకొని నాకు ముని మనవడిని ఇవ్వు” అని సీరియస్గా చెప్పింది కనకమహాలక్ష్మి.    విరాట్ మాత్రం ఆ మాటలు కూడా వినలేనట్లుగా రూమ్ లోనికి వెళ్లి డోర్ […]

6 min 93 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 14

రాక్షస ప్రేమ -14   “అదే అదే రేపు నేను ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటే వెంటనే ఒప్పేసుకుంటారు కదా, అందుకని అంటున్నాను అంతే..! సరే పద డిన్నర్ చేద్దాం” అని విరాజితను తీసుకొని రూమ్ లో నుండి బయటికి వచ్చింది…   “పిలుస్తుంటే రూమ్ లో నుంచి బయటికి రావేంటి..?” అని వీరాజితని చూసి చిరు కోపంగా అన్నది పూజిత.   విరజిత నోరు తెరిచి సమాధానం చెప్పక ముందే శౌర్య “అమ్మ అక్క […]

6 min 97 views
రాక్షసప్రేమ Premium

రాక్షసప్రేమ – 15

రాక్షస ప్రేమ -15     “నీ క్యూట్ ఫేస్ చూస్తే నేను వెంటనే మెల్ట్ అయిపోతాను కానీ ఇప్పుడు కాదులే, పనిష్మెంట్ ఈరోజు కాలేజీ అయిపోయి మనం ఇంటికి వెళ్లే టైం కి కచ్చితంగా నీకు పనిష్మెంట్ ఇచ్చి తీరుతాను, అది కూడా మనకి జీవితాంతం మెమొరబుల్ గా ఉంటుందిలే” అని అల్లరిగా చెప్పి, ” సరే నాకు ప్రాక్టీస్ కి టైం అవుతుంది నిన్న ఆ నిఖిల్ ప్రాక్టీస్ లో డైవర్ట్ అయ్యాడు అని […]

6 min 96 views