మరో పక్క అవి నీ ఫోన్ లో బెదిరించే ఆ అన్ నోన్ పర్సన్ కి శిశిర కనిపించడం లేదు అని , అవి హైదరబాద్ వెళ్ళాడు అనే విషయం తెలిసి ….
శిశిర సూసైడ్ చేసుకొని చనిపోయింది అంటే నేను అసలు నమ్మను…ఎక్కడో ఏదో జరిగింది…సం థింక్ ఈస్ రాంగ్… ” అని అనుకుంటూ శిశిర గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
………..
అవి ఏమో క్యాబ్ లో హాస్పటల్ కి వెళ్తూ కళ్ళు మూసుకుని తల సీటు కి ఆనించి….ఇన్ని రోజులు శిశిర నీ ఎలా టార్చర్ చేశాడు అనే విషయాలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు.
వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు ఎంతో హ్యాపీగా శిశిర తో తన ప్రేమ విషయం చెప్పి తనతో కలిసిపోవాలి అని మనసు లో ఉన్న కూడా ఆ అన్ నోన్ వ్యక్తి బెదిరింపులకు భయపడి…