విరాట్ ఏం మాట్లాడకుండా చూస్తుంటే “నువ్వు ఇప్పుడు వస్తున్నావా రావడం లేదా?” అనగానే “సరే పద” అంటూ విరాట్ కార్ స్టార్ట్ చేయడంతో “థాంక్స్ రా బావ” అంటూ కార్తీక్ కూడా పక్కన కూర్చుని బ్యాచిలర్ పార్టీకి బయలుదేరిపోయారు….
అక్కడికి వెళ్ళాక కార్తిక్ కనీసం పెళ్లి చేసుకోబోతున్న ఫ్రెండ్ కి విష్ కూడా చేయకుండా డ్రింక్స్ వైపుగా వెళ్ళిపోవడంతో తాగుబోతు ఎదవ అని తిట్టుకుంటూ విరాట్ వాళ్ళ దగ్గరికి రావడంతో “హెలోరా మామ” అని పలకరిస్తూ అందరూ ఒకచోట కూర్చోడంతో వాళ్లతో జాయిన్ అయ్యాడు విరాట్….
“మన బ్యాచ్లో మొదట పెళ్లి చేసుకోబోతున్న వాడు వీడే” అని పెళ్ళికొడుకు శిరీష్ భుజం తట్టి మిగిలిన ఫ్రెండ్స్ అందరూ ఆటపట్టిస్తూ ఉండడంతో “కాలేజీలో ఒక అమ్మాయి కూడా నీ మొహం చూసేది కాదు నిన్నెవరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు రా” అన్నాడు విరాట్….
“నువ్వు హ్యాండ్సమ్ కావచ్చు గాని నన్ను ఇలా ఇన్సల్ట్ చేయకూడదు రా” అని శిరీష్ మూతి ముడుచుకోవడంతో “ఊరికే అన్నానులే” అంటూ “ఎంత కట్నం తీసుకుంటున్నావ్?” అనగానే “మా మామయ్యకి ఆంధ్ర వైపు చాలా పొలాలు స్థలాలు ఉన్నాయి రా… పది ఎకరాల పొలంతో పాటు 10 లక్షల కట్నం 30 తులాల బంగారం కూడా పెడుతున్నారు” అన్నాడు….
“30 తులాలు బంగారం అంటే దగ్గర దగ్గర 30 లక్షలు… అంత బంగారం పెడుతున్నాడు అంటే మీ మామయ్య బాగా సౌండ్ పార్టీ అయ్యుంటాడు… మాక్కూడా ఇలాంటి సంబంధాలు ఉంటే చెప్పరా బావ” అని మిగిలిన ఫ్రెండ్స్ కూడా ఆటపట్టిస్తూ ఉండడంతో శిరీష్ మూతి ముడుచుకుంటే కార్తీక్ మాత్రం హాయిగా పెగ్ మీద పెగ్ వేస్తూ ఉంటే “రేయ్… మరొక అరగంటలో మనం బయలుదేరి పోవాలి… అంటే మనం వెళ్లేసరికి ఇంకా డిన్నర్ టైం కూడా అవ్వదు కాబట్టి నువ్వు ఫుల్ గా అయ్యావు అంటే మావయ్యకి డాడీకి డౌట్ వచ్చి అడిగితే నేను మాత్రం చెప్పేస్తాను” అన్నాడు…
“రేయ్ దుర్మార్గుడా?” అని కార్తీక్ కోపంగా చూస్తూ ఉంటే విరాట్ సైడ్ స్మైల్ ఇచ్చి ఫ్రెండ్స్ ఏదో మాట్లాడుతూ ఉంటే వాళ్లతో మాట్లాడుతూ కూర్చునిపోయాడు…