New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏడడుగుల ఆవేదన – 4

ఏడడుగుల ఆవేదన – 4

అంత బానే ఉంది కానీ అమ్మ ఆ పిల్ల ఎలా ఉంటుందో వాడికి నచ్చుతుందో లేదో 

 

మనం వెళ్ళి ఒకరోజు చూద్దాం మనకి వాళ్ళ తరుపున ఏం వద్దు మనకే చాలా ఉంది కాబట్టి ఇచ్చే పోసిషన్ లో. కూడా వాళ్ళు లేరు మనకి ఆ పిల్ల కట్టుబట్టలతో వచ్చిన పర్లేదు మనకి కావలిసింది మంచి పిల్ల తనతో వొచ్చే ఆస్తులు కాదు ఆ పిల్ల అమ్మ నెంబర్ నా దగ్గర ఉంది నేను మాట్లాడి చెప్తా 

అని ఆవిడ గదిలోకి వెళ్తుంది 

 

విష్ణు గారు ఆలోచనలో పడతారు 

 

మాధవి గారు పక్కన కూర్చుని ఏం అయ్యింది అండి 

 

అలా కాదే వాడు చూస్తే ఇలా ఉన్నాడు అమ్మ ఏమో ఆ పిల్లే కావాలి అంటుంది ఏం అవుతుందో ఏంటో 

 

పంతులు గారు చెప్పారు కదా అండి వాళ్ళు ఒకరి కోసం ఒకరు పుట్టిన వాళ్ళు అని ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు 

 

వాడు ఓపుకుంటాడో లేదో 

 

విరాట్ విషయం అత్తయ్య చూసుకుంటారు లెండి 

మీరు ఎక్కువ ఆలోచించకండి 

 

***

 

ఇటు నెంబర్ ఇచ్చి వారం రోజులు అవుతున్న ఫోన్ రాకపోవడం తో జానకి గారు నిరాశకి లోను అవుతారు కూతురు జీవితం బాగుంటుంది అని ఆశ పడిన ఆవిడకి నిరాశ మిగులుతుంది అనుకోలేదు అందుకే రేపు మళ్ళీ గుడికి వెళ్ళి పంతులు గారిని కలవాలి అని అనుకుంటుంది 

 

ఇంతలోనే ఆవిడ ఫోన్ మోగుతుంది నెంబర్ కనిపించడం తో ఎవరు అని లిఫ్ట్ చేస్తుంది 

 

జానకి ఎలా ఉన్నావు అమ్మ 

 

ఎవరు అండి 

 

నేను అమ్మ కిందకి వారం గుడిలో కలిశాను గా మర్చిపోయావా 

 

లేదు అండి గుర్తు ఉన్నారు చాలా రోజులు అవుతుంది కదా ఇంకా చేయరు అనుకున్న 

 

మా గురువు గారు లేరు అమ్మ నిన్న నే కాశి నుంచి వోచారు అందుకే ఇనీ రోజులు పట్టింది అమ్మాయి ఎలా ఉంది 

 

బాగుంది అండి కాలేజీ కి వెళ్ళింది 

 

రేపు వొచ్చే శుక్రవారం పిల్లని తీసుకొని మొన్న మనం కలిసిన గుడికి తీసుకు రా మంచి గా రెడీ చేసి ( లక్ష్మీ గారికి జానకి ఇంటి పరిస్థితి తెలుసు కాబట్టి వీళ్ళు ఇంటికి వెళ్తే మళ్ళీ కంగారు పడతారు అని గుడికి తీసుకు రామంటారు)

 

సరే అండి అని చెప్పి ఫోన్ పెట్టేసారు 

జానకి గారికి చాలా సంతోషం గా అనిపిస్తుంది కూతురు జీవితం మరబోతుంది అని ఆనంద పడతాడు 

 

అలా రానే వొచ్చింది శుక్రవారం శ్రీనిధి నీ ఆరోజు కాలేజ్ కి వద్దు అని చెప్తారు జానకి గారు శ్రీనిధి ఈరోజు కాలేజ్ లో పెద్దగా క్లాసెస్ కూడా ఏం లేకపోవడం తో తను కూడా మానేసింది వాళ్ళ అమ్మ మొన్న దీపావళి కి కొన్న లంగా ఓణి వేసుకొని క్లిప్ పెట్టీ జుట్టు వొదిలేస్తుంది చేతులకి గాజులు మెడలో చిన నెక్లెస్ వేసుకొని మంచిగా అందం గా రెడీ అవుతుంది 

 

కూతురు నీ చూసి మెట్టికలు విరుస్తారు జానకి గారు వెళ్దామా అమ్మ

 

పదా అని కూతురు నీ తీసుకొని బయలుదేరతారు 

 

గుడి ఇంటి దగ్గరే అవడం తో నడుచుకుంటూ వెళ్తారు 

 

వీళ్ళు వెళ్ళేసరికి లక్ష్మీ గారు వాళ్ళు రారు కూతురు నీ గుడిలో కూర్చోమని ఆవిడ వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటారు 

 

వాళ్ళ అమ్మ ఏం చేస్తుందో అర్థం కాక చూస్తుంటుంది శ్రీనిధి 

 

అలా ఒక15 నిముషాలకి వస్తారు లక్ష్మీ గారు 

 

గుడి బయట వాళ్ళని చూసి ఎదురు వెళ్తారు 

 

బాగున్నరా పిన్ని గారు అని అడుగుతుంది 

 

బాగున్న అమ్మ ఇదిగో నా కొడుకు కోడలు 

 

నమస్కారం అండి 

 

నమస్కారం అని చెప్పి లోపలకి వెళ్తారు 

 

దర్శనం అయిందా లేదు అండి మీ కోసం ఎ ఉన్నాను అందరూ కలిసి చేసుకో వొచ్చు అని 

 

అమ్మాయి ఎక్కడ అదిగో అక్కడ అని గుడి లోపల కూర్చొని ఉన్న శ్రీనిధి నీ చూపిస్తుంది 

 

పచ్చ ఎరుపు కలిపి ఉన్న లంగా ఓణి లో బుట్ట బొమ్మ లా ఉంటుంది శ్రీనిధి 

చూడగానే నచ్చేస్తుంది వాళ్ళకి 

 

జానకి శ్రీనిధి పిలుస్తుంది 

 

శ్రీనిధి కి ఎవరో తెలియక అలా చూస్తుంది 

 

అమ్మమ్మ గారికి కళ్ళకి ధనం పెట్టుకో అని చెప్తారు అలానే చేస్తుంది 

 

చల్లగా ఉండు తల్లి అని దీవిస్తారు 

 

మావయ్య అత్తయ్య కి కూడా చేయి అంటారు అలానే చేస్తుంది వాళ్ళు కూడా దీవిస్తారు 

 

శ్రీనిధి కి ఏం అర్థం కాదు వాళ్ళని తను ఎప్పుడు చూసింది కూడా లేదు ఇప్పుడు అమ్మ వరసలు కలిపి మరి చెప్తుంది అది కూడా కళ్ళకి ధనం పెడుతుంది అని ఆలోచిస్తుంది 

 

సరే లోపలకి వెళ్ళి దర్శనం చేసుకొని తరువాత మాట్లాడుకుందాం అని అంటారు లక్ష్మీ గారు అలానే అని అందరూ దర్శనం చేసుకొని కూర్చుంటారు 

 

ఇంకా ఉంది 

 

ఈ స్టోరీ నచ్చితే ఫాలో చేయండి కామెంట్ చెయ్యండి