అంతే చాలా కాదు సర్వం సర్వం మిస్ చేశావు.. అంటూ బలంగా నన్ను నా బావ వెనక్కి తోసేసాడు.
ఆ ఫోర్స్ కి వెనక్కి వచ్చి పడ్డ నాకు సీట్ అప్పచ్చి అయ్యింది.
ఇప్పుడు అదంతా చూసుకునే స్టేజ్ లేదు నాకు. ఠక్కున లేచి మళ్లీ బావని చుట్టేసుకోవడానికి చూశానా..??? ముట్టుకుంటే చంపేస్తా అని చూపుడు వేలు చూపిస్తున్న బావ బేస్ వాయిస్ కి భయపడి వెనక్కి జరిగి గోడకి అని కూర్చున్న.
ఒక కాలు చాపి, నిలబెట్టిన రెండో కాలి మీద చెయ్యి వేసి చంపేస్తున్నావు కదే నన్ను అనడంతో నా ప్రాణం చివుక్కుమంది.