New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నీలి చిత్రం మాటు – 1

నీలి చిత్రం మాటు – 1

1

మరొక కొత్త బుజ్జి స్టోరీ మీకోసం తెచ్చేసాను.. 
సహజంగా భార్యాభర్తల మధ్య ఉండే చిన్ని చిన్ని ప్రాబ్లమ్స్ తో  సాగే ఈ కథ.. ఒక అడిక్షన్ తో ఏ మలుపు తిరిగిందో తెలుసుకోవాలంటే ఫాలో అవ్వండి..
ఇది అడల్ట్ కంటెంట్ కాదు, వయసులో ఉన్న వాళ్ళ కోసం.
సరదా అని మొదలుపెట్టి సమయం తెలియనంతగా ఒక రకమైన వ్యసనంగా మార్చుకొని తెలియని చీకటి వలయంలో చిక్కుకునే కొంతమంది కోసం
ఒళ్ళు తెలియకుండా బాధ్యతలు మరిచి తప్పులు చేస్తే పర్యవసానం ఎలా ఉంటుందో ఈ కథలో తెలుసుకోండి.
ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు.. ఎవరికైనా సరే తప్పు చేస్తే దాని ఫలితం మారొచ్చేమో కానీ వదిలిపెట్టదు. 
నాకు తెలిసిన ఒక సిచువేషన్ బేస్ చేసుకొని ఈ స్టోరీ ఫ్రేమ్ చేశాను.. ప్రతి ఎపిసోడ్కి మీ కామెంట్స్ కోసం చూస్తాను.
***************
రమ్య నిమిషానికి ఒకసారి గోడ మీద గడియారం చూస్తూ హడావుడి హడావుడిగా పనిచేస్తుంది.
రోజుటి కన్నా ఈరోజు అరగంట లేట్ అయింది‌ తన వర్క్ ఇంకా అవలేదు. కరెక్టుగా 10 కి తన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది.
ప్రదీప్ ని చూస్తే ఇంకా ఏదో సర్దుకుంటూ హాల్లోనే ఉన్నాడు. గబ గబా హాట్ పాక్ ప్రిపేర్ చేసి అన్ని బ్యాగ్ లో సర్ది పట్టుకొచ్చి ప్రదీప్ ముందు టేబుల్ మీద పెట్టింది.
థాంక్యూ రమ్య అని చిన్న స్మైల్ తో చెప్పాడు తనని చూడకుండానే. తనకి మాత్రం చాలా టెన్షన్ గా ఉంది. ప్రదిప్ త్వరగా వెళ్ళిపోతే బాగుండు అనుకుంటుంది. 
మీకు ఇంకా టైం పడుతుందా అని వేళ్ళు నలుపుకుంటూ అడిగిన రమ్య. ఏ రమ్య ఏమైనా పని ఉందా అని అడుగుతూ తల ఎత్తి చూసిన ప్రదీప్ క్లాక్ వైపే చూస్తున్న రమ్య ఫేస్ లో టెన్షన్ కి అసహనం ఆవరించింది. 
ప్రదిప్ అడిగింది కూడా తను వినలేదు. రమ్య అని గొంతు పెంచి పిలిచేసరికి చూసి ఏమన్నా కావాలా అని అయోమయంగా అడిగింది. 
నాకేమీ అక్కర్లేదు నీకేం కావాలి. లాస్ట్ 15 డేస్ నుంచి చూస్తున్నాను దీనికో టెన్షన్ పడుతున్నావు ప్రతిదానికి హడావిడి పడుతున్నావు.
ఇదివరకు నేను వెళ్తున్నాను అంటే డల్ గా ఉండే నువ్వు ఈ 15 డేస్ నుంచి ఎప్పుడు వెళ్తారు.. ఎప్పుడు వెళ్తారు.. అని ఎదురు చూస్తున్నట్టు ఉంది.
నాకు తెలియకుండా ఏమైనా చేస్తున్నావా?? అని అడుగుతు లేచి నిలబడ్డాడు ప్రదీప్.
భర్త సూటిగా అలా ప్రశ్నించేసరికి తడబడి సైడ్ కి తిరిగిన రమ్య ఎందుకు అలా అడుగుతున్నారు?? 
అయినా.. అయినా.. మీకు తెలియకుండా నేను ఎం చేస్తాను.. చేయడానికి ఏముంది?? అంది అప్పటికప్పుడు తెచ్చి పెట్టుకున్న కోపంతో ఎదురు ప్రశ్నిస్తు.
సంథింగ్ ఇస్ రాంగ్ రమ్య, నేను అబ్జర్వ్ చేస్తున్నాను. లాస్ట్ 15 డేస్ నుంచి నువ్వు ఏదో చేస్తున్నావు. 
అది జాబ్ ట్రైల్స్ అయితే మానుకో అని ఆర్డర్ వేసినట్టు సీరియస్ గా చెప్పి ఈవినింగ్ వచ్చాక దీని గురించి డిస్కస్ చేద్దాం అంటూ టైం 9 : 45 చూపిస్తూ ఉండడంతో ఇక తన హాట్ ప్యాక్, లాప్టాప్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు ప్రదీప్.
తెచ్చి పెట్టుకోవడం కాదు ఈసారి ప్రదీప్ చెప్పిన దానికి నిజంగానే కోపం వచ్చిన రమ్య చీర కొంగు దులుపుకొని గుమ్మం వరకు వచ్చి ప్రదీప్ బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్లే వరకు అక్కడే నిలబడింది.
భర్త మీద ప్రేమ, గౌరవం, ఇష్టం అన్ని ఉన్నాయి. కానీ ఇదిగో ఇటువంటి ఆర్డర్స్ వేస్తేనే తీసుకోలేక ఆ కోపంతో అప్పుడప్పుడు డిస్టెన్స్ మైంటైన్ చేస్తుంది.
ఆ కోపం, ఇద్దరి మధ్య దూరం ప్రదీప్ కి అర్థం అవుతున్నా కూడా రమ్య ని జాబ్ కి పంపించాలని వన్ పర్సెంట్ కూడా అనుకోవడం లేదు తను.
జస్ట్ మ్యారేజ్ అయ్యి 9 మంత్స్ అయింది. మ్యారేజ్ అయినా టూ మంత్స్ కే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ కావడంతో ఫ్యామిలీకి దూరంగా ఇద్దరు కొత్త కాపురం మొదలుపెట్టారు.
పెళ్లయిన కొత్త జంట ఇద్దరి మధ్యలో అడ్డం ఎందుకని పెద్దవాళ్ళు కూడా వాళ్ళ సంతోషాం కోరుకుంటూ దూరంగా ఉన్నారు.
ఫోన్స్ లో పలకరింపులే తప్ప ఇప్పటివరకు డైరెక్ట్ గా వచ్చింది లేదు పెద్దవాళ్లు కూడా.
బై.. చెప్పి ప్రదీప్ గేట్ దాటగానే అతనికి వినిపించే అంత గట్టిగా డోర్ క్లోజ్ చేసింది రమ్య. తిరిగి చూసి నవ్వుకున్న ప్రదిప్ నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు తెలుసులే అనుకుంటూ వెళ్లిపోయాడు.
గోడ మీద గడియారం చూసినా రమ్య.. ఛా.. ఇంకా ఫైవ్ మినిట్స్ ఏ ఉంది. ఈ లింకు ఓపెన్ అవడానికి ఈజీగా ఫైవ్ మినిట్స్ తీసుకుంటుంది. ఏదైనా మొదటి నుంచి చూస్తేనే కదా ఆ ఎక్సైట్మెంట్, త్రిల్ లాస్ట్ వరకు మైంటైన్ చేయగలం.
ఒక్క సీన్ మిస్ అయినా ఏదోలా ఉంటుంది అని ఫాస్ట్ గా ఫోన్ తీసుకొని ఈ వన్ మంత్ నుంచి తను డైలీ యూస్ చేస్తున్న లింక్ క్లిక్ చేసి అది బర్ఫింగ్ అవడం చూసి విసుగ్గా ఫోన్ అక్కడే పెట్టి మెయిన్ డోర్ చెక్ చేసుకుంటూ కిచెన్ లోకి వెళ్లి అక్కడ డోర్ కూడా క్లోజ్ చేసి ఫేస్ వాష్ చేసుకుని, మళ్ళీ హాల్లోకి వచ్చి ఫోన్ తీసుకొని బెడ్ రూమ్ లోకి వెళ్లి, డోర్స్ క్లోజ్ చేసుకుని, ఏసీ ఆన్ చేసుకుని.. ఆ చల్లటి గాలికి రిలాక్స్ గా ఊపిరి తీసుకుంటూ ఇంకా కనెక్ట్ అవ్వని లింక్ ని తిట్టుకుంటూ మళ్లీ టైం చూసింది.
అనుకున్న టైం కన్నా టూ మినిట్స్ క్రాస్ అయిపోయింది. 
ఇంట్రడక్షన్ మిస్ అవ్వకుండా ఓపెన్ అవవే అని ఫోన్ మీద విసుక్కుంటూనే టవల్ తీసుకొని ముఖం తుడుచుకున్నాక బొట్టు పెట్టుకుని అద్దంలో చూసుకుంది రమ్య.
ఇక స్నానం చేయలేదు, అయినా కూడా ఆకర్షించే రూపం. ఒత్తైనా సిల్కీ హెయిర్, పైకి ఫోల్డ్ చేసి క్లిప్ పెట్టేసింది. అయినా సరే చెంపలకి రెండు వైపులా సన్నగా కదులుతున్న బేబీ హెయిర్ ఆమె కోల ముఖాన్ని చాలా సెక్సీగా చూపిస్తుంది.
@@@@@@@@@@
కామెంట్స్ మస్ట్ బేబీస్…💞
__వర్ణ