రూప సడెన్గా అలా చేస్తుంది అని ఊహించని ఆర్య అతని చెయ్యి ఎక్కడ ఉందో చూసుకొని కరెంట్ షాక్ కొట్టిన కాకిలా బిగుసుకు పోతాడు.
కళ్ళు రెండు పెద్దవి చేసి రూప నీ చూస్తూ ఉంటే … రూప మాత్రం నాకు అసలు ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టు హ్యాపీగా బుజ్జి కుక్క పిల్లలా ముడుచుకొని పడుకొని ఉంది.
అలా పడుకున్నప్పుడు తన లిప్స్ రెండు కొంచం ముందుకి ముడుచుకున్నట్టు పెట్టీ పడుకొని ఉంది.
ఆ లిప్స్ నీ చూస్తూ ఉంటె ఆర్య బాబు గుండె గట్టిగా కొట్టేసుకుంటూ ఉంది. పాప ఏమి బాబు ఫీలింగ్స్ తో సంబంధం లేదు అన్నట్టు ఇంకా ఇంకా ఆర్య కి అతుక్కు పోతూ … అతని చేతిని మొత్తం మోచెయ్యి వరకు చుట్టుకొని హ్యాపీగా పడుకుంది.