New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life)

98 stories Ongoing Romance Love Suspense

ఎపిసోడ్ 1ఆకాశంలో మబ్బులు దూదిపింజల్లా అక్కడక్కడా రిలాక్సవుతున్నాయి. ఆ మబ్బుల చాటు నుండి చంద్రుడు సముద్రంతో దాగుడు మూతలు ఆడుతున్నాడు. అయినా చంద్రుని వెండి కిరణాలను చూసి సముద్రం ఉప్పొంగి వాటిని అందుకోవాలని ఆరాటపడుతూ, నురగలు కక్కుతుంది. ఆకాశాన్ని అందుకోవాలనీ సముద్రం, సముద్రం లో కలవాలని ఆకాశం, ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయి.ఆ సమయంలో సముద్రపు తెల్లని నురగతో, చంద్రుని వెండి వెన్నెలతో, పోటీ పడుతూ ఉల్లి పొరలాంటి లేత నీలిరంగు చీరలో  సముద్రపు ఒడ్డున ఇసుకలో పడుకొని ఆకాశాన్ని చూస్తూ ఉంది. ఆ అమ్మాయి మనసు చెబుతున్న ఊసులను సముద్రం వింటోంది. ఆమె ఎద లో జరుగుతున్న అలజడిని ఆకాశం గమనిస్తూ వుంది. పడుకుని ఉన్న అమ్మాయిలో చిన్నపాటి కదలిక మొదలయింది. ఎక్కడినుంచో లేజర్ లైట్లలా అతని…

Browse Stories

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 71

ఎపిసోడ్ 71   తన కెరిర్ ని స్పాయిల్ చేయాలని ఆలోచిస్తున్న వీళ్ళకు ఖచ్చితంగా తన గురించి తెలిసేలా చేయాలి.. అని అనుకుంది స్వప్నిక.   “తాతగారు, అత్తయ్యలు అలా ఆలోచించడంలో తప్పు లేదు..” అన్న స్వప్నిక మాటలకు అయోమయంగా చూస్తూ   “అదేంటమ్మా అలా అంటావ్?” అని అడిగారు కృష్ణమూర్తి.   “అవును తాతయ్యా, అత్తయ్య  తనకు కోడలిగా లాస్య రావాలని ఇష్టపడ్డారు..    దీప అత్తయ్య కూడా మరో అమ్మాయి గురించి ఆలోచించింది..   […]

5 min 18 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 72

ఎపిసోడ్ 72   “నీకో విషయం తెలుసా? నేను జీవితంలో నిన్ను వదిలి పెట్టను. దట్స్ ఫైనల్ ” ఖచ్చితంగా చెప్పాడు విజె.   “బాగుంది. మీ అమ్మగారు మనకు డివోర్స్ ఇప్పించడానికి చిన్నత్తతో కలిసి ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తుంది.    ఇక్కడ మీరు నన్ను వొదలనని అంటున్నారు. కాని మన కాంట్రాక్ట్ మరిచిపోయారా?” అని అడిగింది స్వప్నిక.   ఒక్కసారి ఆమె వైపు సీరియస్ గా చూసి.. “అదెందుకు గుర్తుండదు? లేకపోతె నువ్వు ఎలాగో […]

4 min 20 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 73

ఎపిసోడ్ 73   విజె ఇంట్లో ఇంకా నీకు పని ఉండదని అన్ నోన్ పర్సన్ చెప్పడంతో భయపడుతుంది స్వప్నిక. తరువాత ఏమవుతుందో తెలుసుకుందాం..   విజె ఫైల్స్ అన్నీ చూసుకున్నాక.. కాశీకీ ఫోన్ చేసాడు..    “కాశీ.. అన్ని కరెక్ట్ గానె ఉన్నాయి..నేను రెండు నిమిషాల్లో సి.ఇ.ఒ. మేడంతో కలిసి బయలుదేరుతాను..నువ్ అక్కడికే వొచ్చెయ్యి.” అని చెప్పాడు విజె..   “ఒకె సర్, మరి అడ్రస్?”    “నో ప్రాబ్లం. మేడమ్ ఉన్నారు కదా?”   […]

4 min 17 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 74

ఎపిసోడ్ 74   స్వప్నిక ఎందుకు అలా చేసిందో విజెకు ఏం చేయాలో అర్థం కాలేదు..   అవ్వన్నీ దాటి బయటకొచ్చే సరికి ఆమె ఎక్కిన కారు రయ్య్ మంటూ దూసుకెళ్ళింది..   అసలు ఎందుకిలా చేసిందో అంతు బట్టక తల బద్ధలు కొట్టుకోగా కాశీ నుండి ఫోన్ వొచ్చింది..   “హలో, కాశీ నీ బైక్ బాగయ్యిందా? లేదా?” కంగారుగా అడిగాడు విజె.   “బాస్, నేను లిఫ్ట్ అడిగి బయలు దేరాను.. ఆల్ రెడి […]

4 min 29 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 75

ఎపిసోడ్ 75   “బ్రో, కొంపదీసి కారు బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయో ఏమో?” అన్న భరత్ మాటలు విన్న విజె కోపం ఒక్కసారి తారాస్థాయికి చేరుకుంది..    అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి.. నరాలు తేలి బైసప్స్ బిగుసుకున్నాయి.. అలా విజెను చూసిన అతను ఒకడుగు వెనక్కి వేసాడు..   అతను వొచ్చి  అలా మాట్లాడటం అక్కడున్న వాళ్ళకు అస్సలు నచ్చలేదు..   అది గమనించిన కృష్ణమూర్తి గారు.. “అమ్మా, దీపా, నీ వెంట  ఇతన్నెందుకమ్మా  తీసుకొచ్చావు?” అని […]

4 min 16 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 76

ఎపిసోడ్76   స్వప్నికను స్పెషల్ వార్డ్ లోకి షిఫ్ట్ చేస్తారు. అందంతా చూస్తున్న ఒకడు ఇక్కడ జరిగిన విషయాన్ని ఎవరికో చేర వేస్తాడు..తరువాత ఏం జరుగుతుందో చూద్దాం.    ఆ బిల్డింగ్ చాలా పెద్దగా ట్రెండీగా ఉంది..లోపలికి వెళ్ళగానే కొద్ది దూరం వరకు లాన్.. పక్కన రెండు ఆల్ షేషన్ కుక్కలను గార్డ్స్ పట్టుకుని నిలబడ్డారు..    వాళ్ళకి ఎదురుగ చాలా పెద్ద స్విమ్మింగ్ ఫూల్.. అందులో కండలు తిరిగిన బాడీతో స్విమ్ చేస్తూ ఉన్నాడు భువనేష్..  […]

4 min 16 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 77

ఎపిసోడ్ 77   ఇంతలో వీజే ఫోన్ మోగింది.. కాశీ వివరాలన్ని తెలుసుకుని చెప్పాడు..    ఆ విషయాలు తెలిసి ఒక్కసారి షాక్ అయ్యాడు విజె..   వెంటనే శివ శంకరం అంకుల్ కి ఫోన్ చేసాడు విజె..   “అవును బాబు.. నువ్వు విన్నది నిజమే.. నాకు అనుమానం వొచ్చి ఇంతకు ముందే  మన ఇంటి సిసి ఫుటేజ్ లన్నీ చూసాను విజె..    తెల్లవారు ఝామున  మూడు గంటల ప్రాంతం లో మన ఇంట్లోకి […]

4 min 15 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 78

ఎపిసోడ్ 78   స్వప్నిక చేతిని అలాగే పట్టుకుని తన పెదవులకు ఆనించుకుని ముద్దు పెట్టుకున్నాడు వీజే..   ఆమె తన చేతిని లాక్కోబోయి నొప్పితో  అబ్బా, అని అంది..   “చూసావా నన్ను బాధ పెడితే నీకే నొప్పి పుడుతుంది..” అన్న అతని మాటలకు ఆమె కళ్ళు దించుకుంది..   ఆమెను అలాగే చూస్తూ.. “స్వప్నీ, నువ్వు నొప్పితో బాధ పడుతుంటె.. నాకు ఇక్కడ నొప్పిగా ఉంది..ప్రామిస్.” అని తన గుండెపై వేలితో చూపించాడు విజె. […]

4 min 16 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 79

ఎపిసోడ్ 79   రవళి తల్లి వెళ్ళిన వైపు చూసి కోపంగా ఒక అడుగు ముందుకు వేయపోయాడు వీజె. దాంతో అతన చెయ్యి పట్టుకుని ఆపింది స్వప్నిక.   ” స్వప్నికా, ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు తేల్చుకోవాలి.. నీకేం తెలియదు. నన్ను ఎందుకు ఆపుతున్నావు చెప్పు” అని సీరియస్ గా అడిగాడు విజె.   అతని సీరియస్ నెస్ ని అర్థం చేసుకున్న స్వప్నిక అక్కడ ఏమవుతుందో ఆమె ఊహించగలిగింది. అందుకే..   “అవసరమా విజె? లాస్య […]

4 min 13 views
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) Premium

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 80

ఎపిసోడ్ 80   మల్లిక మేడం ఇంటి నుండి సూప్ తీసుకువచ్చింది. దాన్ని తీసి స్వప్నికకు తాగించ బోయింది.      తను తాగిస్తానని ఆమె చేతిలోని బౌల్ ని తీసుకున్నాడు విజె..   స్వప్నిక పక్కన కూర్చుని కొద్దికొద్దిగా ఆమె నోటికి స్పూన్ తో అందించాడు..   ‘లవ్ అనేది ఇంత పని చేయిస్తుందా అని ఆశ్చర్యంగా అతన్ని చూసాడు మహేష్.    “ఏమైనా నీకు హ్యాట్సాఫ్ సిస్టర్..మావాడి కొమ్ములు వంచి సెట్రైట్ చేసావు..” అని […]

4 min 12 views