నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 1
ఎపిసోడ్ 1 ఆకాశంలో మబ్బులు దూదిపింజల్లా అక్కడక్కడా రిలాక్సవుతున్నాయి. ఆ మబ్బుల చాటు నుండి చంద్రుడు సముద్రంతో దాగుడు మూతలు ఆడుతున్నాడు. అయినా చంద్రుని వెండి కిరణాలను చూసి సముద్రం ఉప్పొంగి వాటిని అందుకోవాలని ఆరాటపడుతూ, నురగలు కక్కుతుంది. ఆకాశాన్ని అందుకోవాలనీ సముద్రం, సముద్రం లో కలవాలని ఆకాశం, ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయి. ఆ సమయంలో సముద్రపు తెల్లని నురగతో, చంద్రుని వెండి వెన్నెలతో, పోటీ పడుతూ ఉల్లి పొరలాంటి […]