ఇంటికి రాగానే అమ్మకి కాసేపు హెల్ప్ చేసి నాన్న శేషాద్రితో మాట్లాడుతూ కూర్చుంది చారు.
ఇంటర్ వరకు చదివావు డిగ్రీలో అదేదో ర్యాగింగ్ జరుగుతోందని మానేసి మూడు సంవత్సరాల నుండి ఇంటి దగ్గరే ఉన్నావు?
చెప్పమ్మా నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు మళ్లీ చదువుతాను అన్న నాకు ఏమీ అభ్యంతరం లేదు లేదంటే మంచి సంబంధం చూస్తాను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు చారు తండ్రి శేషాద్రి.
ఏం చెప్పలేని ఆమె ఎప్పటిలాగే భుజాలు ఎగరేసింది.
ఇక్కడ క్యారీ వ్యాన్ లో తన ఇంటికి చేరుకున్నాడు సిద్దు.
హాల్లో అంతా హడావిడి కనిపించేసరికి ఏమైంది డాడీ ఎక్కడ అని పని వాళ్ళను అడగ్గానే బాబు అయ్యగారు షాపింగ్ కు వెళ్లారండి అని ఒక పనావిడ వచ్చి చెప్పింది.
ఈయనకి కావాల్సినవన్నీ ఇంట్లోనే ఉంటే షాపింగ్ కి బయటికి వెళ్లడం ఎందుకు అనుకుంటూ తండ్రి రామచంద్ర రాజు కి కాల్ చేసేలోపు ఆయనే గుమ్మంలో నాలుగు ఐదు షాపింగ్ కవర్స్ తో ప్రత్యక్షం అయిపోయాడు.