బాబు పొలిమేర దాటినప్పటి నుండి కారు తోలుతుంటే వస్తున్న ఎర్ర దుమ్ముకి మాస్క్ వేసుకొని ఉండటంతో శేషాద్రి అంతే చూస్తుంటే,
నా కొడుకు బావ అదే నీ అల్లుడు సిద్దు అని చెప్పగానే ఆయన కంటే సుమారు జానెడు పొడవు ఉన్న సిద్దు ముఖాన్ని తేరిపారా చూసి భుజం తట్టి బాగున్నావా రా అని అడగ్గానే మనోడు సైలెంట్ గా తల ఊపాడు.
ఇద్దరినీ తీసుకొని ఆయన ఇంటికి వెళ్లగానే మల్లికా సొంత అన్నయ్యని పలకరించి వదిన లేదని తెలుసుకొని బాధపడి మేనల్లుడిని మనసారా చూసుకుంటూ ఇద్దరికీ గెస్ట్ రూమ్ చూపించింది రెడీ అవ్వమని.