ఎంత ట్రై చేసినా జెస్సీ కళ్ళు తెరవడం లేదు . దాంతో పూర్ణివ్ కి భయంగా ఉంటుంది . ” జెస్సీ నిన్నే ఒక్కసారి లేగు ” అని పెద్దగా అరుస్తాడు .
అప్పుడే అంబులెన్స్ రావడంతో ఇంకా హడావిడిగా రోడ్డు పక్కన పడిన బాబు నీ , జెస్సీ నీ ఇద్దరినీ దాంట్లో ఎక్కించుకొని దగ్గర్లో ఉన్న హాస్పటల్ కి తీసుకొని వెళ్ళారు .విషయం తెలుసుకున్న గాయత్రి అండ్ నాగేంద్ర గారు కంగారుగా హాస్పటల్ కి స్టార్ట్ అయ్యారు .
హాస్పటల్ లో …
ఆ పక్కనే ఉన్న రాహుల్ బాధగా మనసులో జెస్సీ కి ఏం కాకూడదు అని దేవుడిని వేడుకుంటూ ఉంటాడు.