జెస్సీ మాత్రం వాళ్ళని వింతగా , అయోమయంగా చూస్తూ ఉంటుంది .
గాయత్రి గారు ఏడుస్తూ జెస్సీ పాప మొహం అంతా ముద్దులు పెడుతూ …. తన బాడీ అంతా చేతితో తడుముతూ ఉంటారు.
గాయత్రి … గాయత్రి అమ్మాయి ఇప్పుడే స్పృహలోకి వచ్చింది. నీ ఆనందాన్ని కొంచం సేపు అదుపు చేసుకో… మన కూతురు ఎక్కడికి పారిపోదు. ఇక మిద మన దగ్గరే ఉంటుంది.
పాపం ముందు తనకి కొంచం గాలి తీసుకొనే అవకాశం ఇవ్వు ” అని నాగేంద్ర గారు కళ్ళ నిండా నీళ్ళతో నవ్వుతూ గాయత్రి గారితో అంటారు.
ఎలా అండి ..? ఎలా నా సొంతోషాన్ని కంట్రోల్ చేసుకోగలను…? ఇన్ని రోజులు జెస్సీ నీ చూసి ఎందుకు నా మనసు తన వైపు వెళ్తుందో నాకే అర్థం అయ్యేది కాదు. కానీ ఈ రోజు జెస్సీ నేను నవ మాసాలు మోసి కన్న నా బిడ్డ అని తెలిసి ఎలా నా ఆనందాన్ని అదుపు చేసుకోగలను..?