నాగేంద్ర గారు ఎంత ట్రై చేసిన కార్ స్టార్ట్ అవ్వలేదు . ఆయనకి కంగారుతో ఒళ్ళు అంతా చెమటలు పట్టేసాయి. ఏం చెయ్యాలో దిక్కు తోచలేదు. గాయత్రి గారు ఏమో నొప్పులకు పెద్ద పెద్దగా అరుస్తూ ఉన్నారు.
ఇంకా నాగేంద్ర గారు కార్ దిగి చెక్ చెయ్యల్లి అని ట్రై చేసారు కానీ ఆయన వల్ల కావడం లేదు . ఆ వర్షం లో ఎటు వెళ్లలో తెలియక దిక్కు తోచని స్థితిలో దేవుణ్ణి వేడుకుంటూ ఉంటారు.
కార్ లో ఉన్న గాయత్రి గారికి నొప్పులు అంతకంతకూ పెరిగిపోతూ ఉంటాయి. ఆవిడ అరుపులు ఉరుముల శబ్దం చీల్చుకుంటూ నాగేంద్ర గారి చెవులకు వినిపిస్తూ ఉంటాయి.
ఆవిడ పడే వేదన ఆయనకు అర్ధం అవుతున్న కూడా ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితి ఆయనది . దగ్గర్లో ఎక్కడ కను చుపు మేరలో ఇల్లు కానీ , గుడికి కానీ లేదా ఏదైనా సత్రం లాంటిది కానీ లేదు.