Villan – 1
జోరున వర్షం కురుస్తూ ఉంటే ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ గుడికి వెళుతుంది…..
ఆయాస పడుతూ టెన్షన్ పడుతూ పరిగెత్తుకుంటూ గుడి లోపలికి వెళ్లి పూజారి కోసం వెతుకుతూ ఉంటుంది…..
అప్పుడే పూజారి గుడి మూసే సమయం అవడంతో తలుపులన్నీ మూయడానికి…సిద్ధంగా ఉండి తాళాలు తీసుకుని బయటికి వస్తూ కనిపిస్తాడు….
అమ్మాయిని చూసి పూజారి దగ్గరకు వచ్చి ఎవరమ్మా నువ్వు ఈ సమయానికి గుడికి వచ్చావ్ ఇప్పుడు గుడి మూసే సమయం …. పొద్దున వచ్చి దైవ దర్శనం చేసుకో అమ్మ టైం అయిపోయింది గుడి మూసేస్తున్నాను బయటికి వెళ్తే మూసేస్తాను అని అంటాడు పూజారి…..
పూజారి గారు దయచేసి గుడి ముయోద్దండి మా నాన్నగారి పరిస్థితి అసలు బాగోలేదు దైవదర్శనం చేసుకోవాలనుకుంటున్నాను అలాగే మీరు పూజ చేయరా ప్లీజ్ అని బతిమాలుతూ ఉంటుంది ఏడుస్తూ ఆ అమ్మాయి…..
నిన్ను చూస్తే చాలా టెన్షన్ పడుతూ కనిపిస్తున్నావ్ అమ్మ సరే నీకోసం పూజ చేస్తాను అస్సలు ఏంటమ్మా నీ సమస్య అని అడుగుతాడు పూజారి…..
మా నాన్నగారు చావు బతుకులు మధ్య ఉన్నారు పూజారి గారు ఆయన ఆపరేషన్ చేయాలి చేయడానికి డబ్బులు లేవు ఎలా అయినా సరే డబ్బులు సమకూర్చే లాగా ఆ దేవుడు ఏదైనా మార్గం చూపిస్తాడు ఏమో అని దైవ దర్శనానికి వచ్చాను….
ఏడుస్తూ చెబుతూ ఉంటుంది……
అయ్యో తల్లి పెద్ద కష్టమే వచ్చింది నీకు తప్పకుండా దేవుడు ఏదో ఒక మార్గం చూపిస్తాడు అని చెప్పి పూజ చేసి ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తాడు…..పూజారి….
ఇదిగో అమ్మ ప్రసాదం అలాగే ఈ కుంకుమ తీసుకెళ్లి మీ నాన్న నుదుటి మీద పెట్టు దేవుడు అంత మంచి చేస్తారు నీకు అని చెప్తాడు పూజారి
సరే పూజారి గారు…..
ఆ అమ్మాయి దేవుని దండం పెట్టుకుని దేవుడా ఎలా అయినా సరే మా నాన్న ప్రాణాలు కాపాడు….
దండం పెట్టుకుని పరిగెత్తుకుంటూ ఎదురుగా వస్తున్న ఒక మనిషిని గుద్ది సారీ అండి అని చెప్పి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది……
కృష్ణ మూర్తి గారు ఆ అమ్మాయి ఏంటి అంత కంగారుగా వెళ్ళిపోతుంది అని అనుకుంటాడు…..
పూజారి అప్పుడే కృష్ణమూర్తి దగ్గరికి వచ్చి ఏంటి కృష్ణమూర్తిగారు ఇలా వచ్చారు గుడి మూసే సమయానికి అని అంటాడు…..
మీకేమైనా కష్టం వచ్చిందా ఏంటి అని అడుగుతాడు పూజారి కంగారుగా…..
కష్టమంటారా చాలా పెద్ద కష్టం వచ్చింది …. దేవుడు ఏదైనా మార్గం చూపిస్తారేమోనని సమయం చూసుకోకుండా గుడికి వచ్చాను…..
అందరు బాగోగులు చూసే మీకు కష్టమొచ్చిందా అయ్యో అసలు ఈ రోజు ఏం జరుగుతుందండి.. పాపం ఇందాక వచ్చిన అమ్మాయికి ఏమో వాళ్ళ నాన్నగారు హెల్త్ బాగోలేదు అంట డబ్బులు కావాలంట పాపం డబ్బుల కోసం దేవుడిని ప్రార్థించడానికి వచ్చింది అని అంటాడు పూజారి బాధగా ఫేస్ పెట్టి…..
ఆ అమ్మాయికి అర్జెంటుగా డబ్బులు కావాలంట రెండో గంటలో ఆపరేషన్ చేయాలంట లేకపోతే వాళ్ళ నాన్నగారు ప్రాణం మీదికి వస్తుందని బాధపడుతూ చెప్పింది నాకు గుడి పక్కన ఉన్న హాస్పిటల్లోనే వాళ్ళ నాన్నగారి అడ్మిట్ చేశారని చెప్పింది అని అంటాడు పూజారి…..
అమ్మాయిని చూస్తే బాగా జాలిస్తుంది పాపం బాగా ఏడ్చినట్టు ఉంది ఎవరూ లేరు అనుకుంటా తను ఒక్కతే కష్టపడుతున్నట్టు కనిపిస్తుంది పాపం అని పూజారి చెబుతూ ఉంటే కృష్ణమూర్తి ఆలోచనలో పడతాడు…
ఇంతకీ మీ కష్టం ఏంటి కృష్ణమూర్తిగారు అని అడుగుతాడు పూజారి నా కష్టం తీరిపోయింది గుడిలోకి రాగానే అని కృష్ణమూర్తిగారు ఆనందపడుతూ సరే పూజారిగారు నేను రేపు వచ్చి దేవదర్శనం చేసుకుంటాను నేను అర్జెంటుగా హాస్పిటల్ కి వెళ్ళాలి అని కంగారుగా వెళ్ళిపోతాడు కృష్ణమూర్తి…..
అయ్యో కృష్ణ మూర్తి గారికి ఏమైంది అంత కంగారుగా వెళ్ళిపోతున్నారు పోనీలే ఇద్దరి కష్టం తీరిపోయేలా చూడు స్వామి అని దేవుని దండం పెట్టుకొని గుడి తలుపులు మూసి వెళ్లిపోతాడు పూజారి……
ఏడుస్తూ లోపలికి వస్తున్న అమ్మాయి ని ఆగు….
ఎందుకొచ్చావే రాక్షసి అంటూ కోపంగా అంటుంది శాంతి….
అమ్మ నాన్నగారిని చూడనివ్వమ్మా ఒక్కసారి లోపలికి వెళ్తాను నాన్న కోసం అని పూజ చేయించుకుని తీసుకొచ్చాను. ఈ కుంకుమ పెడతాను అమ్మ అని ఏడుస్తూ బతిమాలుతూ ఉంటుంది….. ఆ …..అమ్మాయి…
ఆయన ముందుకు వెళ్తే ఆయన పరిస్థితి ఇంకా విషమిస్తుంది నీ వల్లే కదే ఆయన ఈ పరిస్థితులు ఉన్నది నువ్వు నాకు కనిపించకు నేను నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు చంపేస్తాను ఇక్కడి నుండి వెళ్ళిపో అని చాలా కోపంగా అంటూ ఉంటుంది శాంతి…..
అమ్మ ప్లీజ్ అమ్మ నేను చేసిన తప్పే అలా అని చెప్పి నన్ను దూరం చేయకమ్మా నేను తట్టుకోలేను అని ఏడుస్తూ బతిమాలుతూ ఉంటుంది…..
అందరూ ఆనందంగా ఉండవలసిన సమయంలో నువ్వు చేసిన పని వల్ల మీ నాన్న ఏమో హాస్పిటల్ లో… రెండు రోజుల పెళ్లి పీటల మీద కూర్చోవాల్సిన అక్క పెళ్లి ఆగిపోయే పరిస్థితి తీసుకొచ్చావు…
అలా అనగానే ఆ మాటలన్నీ వింటున్నా ఆ అమ్మాయి ఏడుస్తూ కూర్చుని అక్కడే ఉండిపోతుంది…..
దగ్గరికి వెళ్తే అమ్మ తిడుతుంది అన్న భయం ఒకపక్క నాన్న పరిస్థితి చూసి ఇంకా దిగులుతో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది……
జరుగుతుందంతా గమనిస్తున్న కృష్ణమూర్తి పాపం ఈ అమ్మాయి ఎవరు ఎందుకు అంతలా ఏడుస్తుంది వాళ్ళ తల్లి ఎందుకు తనని అంతలా తిడుతుంది ఏంటో పాపం అని జాలి పడుతూ ఉంటాడు కృష్ణమూర్తి…..
నేను ఏడుస్తూ కూర్చుంటే నాన్న ప్రాణాలను కాపాడలేను అర్జెంటుగా డాక్టర్ తో మాట్లాడాలి అని చెప్పి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది….
వెళ్ళిపోతున్న కూతురు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది శాంతి ఏం చేయాలో ఏం తోచక అక్కడే కూర్చుని చూస్తూ ఉంటుంది….
అప్పుడు అక్కడికి వస్తాడు శాంతి వాళ్ళ అన్నయ్య దామోదర్….
అన్నయ్య అంటూ ఏడుస్తూ శాంతి వచ్చి దామోదర్ ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఊరుకో అమ్మా ఏం కాదు బావగారికి నయమైపోతుంది అని ధైర్యం చెపుతూ ఉంటాడు….
డాక్టర్ దగ్గరికి ఆ అమ్మాయి ఏడుస్తూ డాక్టర్ ఎలా అయినా సరే మా నాన్నగారు కాపాడండి అని బతిమాలుతూ ఏదో ఒకటి చేయండి ప్లీజ్ మా నాన్నగారిని బతికించండి అని అమాయకంగా అంటూ ఉంటుంది…..
ఉన్నట్టుండి అంత డబ్బులు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం డాక్టర్ గారు ప్లీజ్ డాక్టర్ గారు ఏదో ఒకటి చేయండి కొంచెం సమయమైనా ఇవ్వండి ఆపరేషన్ చేయండి అని బతిమాలుతూ ఉంటుంది…..
హాస్పిటల్ రూల్స్ ఒప్పుకోవమ్మా డబ్బులు కడితేనే ఆపరేషన్ చేయాలి మా చేతిలో ఏం లేదు మేనేజ్మెంట్ అంత చూసుకుంటుంది అని డాక్టర్ చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు…..
డాక్టర్ తో మాట్లాడదామని వచ్చిన దామోదర్ తనని అలా చూసి బుజ్జి ఎందుకురా ఏడుస్తున్నావ్? ఏం కాదు అని అంటాడు దామోదర్…
మావయ్య అని చెప్పి ఏడుస్తూ….. మావయ్య నాన్న పరిస్థితి క్రిటికల్ గా ఉంది డబ్బు కడితేనే గాని ఆపరేషన్ జరగదు అంటున్నారు ఇప్పటికిప్పుడు అంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అక్క పెళ్లికి కోసం ఆల్రెడీ అంత ఖర్చు పెట్టేశారు కట్నం కూడా ఇచ్చేశారు ఇప్పుడు ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదు సమయం ఇవ్వండి అంటే ఇవ్వడం లేదు అని ఏడుస్తూ అంటూ ఉంటుంది….
నేను అన్ని చోట్ల ప్రయత్నిస్తున్నాను బుజ్జి ఇప్పుడు పది లక్షలు అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాము అది కూడా నా దగ్గర డబ్బులు లేవు ….పెళ్లి కోసమని మీ నాన్నగారికి నా దగ్గర ఉన్న కొంత డబ్బు ఇచ్చేసాను కూడా నా దగ్గర ఉన్నది కూడా ….ఇప్పుడేమో money లేవు బుజ్జి ప్రయత్నిస్తున్నాను కంగారు పడకు అంటాడు దామోదర్….
సరే బుజ్జి నువ్వు అమ్మని చూసుకుంటూ ఉండు నేను వెళ్లి డబ్బు కోసం ప్రయత్నిస్తాను ఇంకా గంట సమయం మాత్రమే ఉంది కదా అని దామోదర్ బయటికి వెళ్తాడు…..
ఐసీయూలో ఉన్న బుజ్జి వాళ్ళ నాన్న ని చూస్తాడు కృష్ణమూర్తి….
కళ్ళలోంచి కన్నీళ్ళు ఎందుకు కారుతున్నాయి ఈయనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని బాధపడతాడు….
ఏదో ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కృష్ణమూర్తి బుజ్జివైపు కదులుతాడు…
అప్పుడే బుజ్జి ఎదురుగుండా కృష్ణమూర్తి వచ్చి నుంచుంటాడు….
ఎవరండీ మీరు ఎందుకు నా ఎదురుగా ఉన్నారు తప్పుకోండి నేను వెళ్ళాలి అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది……
ని సమస్య అంత నేను విన్నాను మీ నాన్నగారు ఆపరేషన్ గంటలో జరగకపోతే ఆయన ప్రాణాలు పోతాయని కూడా తెలుసు నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను అని అంటాడు కృష్ణమూర్తి…..
ఆ మాటలకి బుజ్జి ఆశ్చర్యపోతూ మీరు నాకు హెల్ప్ చేస్తారా అసలు సమస్య ఏంటో తెలుసా నాకు పది లక్షలు కావాలి ఇప్పుడే కావాలి అని అంటుంది ప్లీజ్ అండి నాతో జోకులు వేసి సమయం కాదు దయచేసి తప్పుకోండి నేను వెళ్ళాలి అని అంటుంది ఏడుస్తూ….
సరే నమ్మకం కుదరకపోతే ఇదిగో పది లక్షలు చెక్ ఇస్తున్నాను ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా అని అడుగుతాడు…….
ఆ చెక్ చేతులు తీసుకుని ఆశ్చర్యపోతూ బుజ్జి షాక్ గురై ఇంత డబ్బు నాకెందుకు ఇస్తున్నారు అసలు మీకేం కావాలి అని అడుగుతుంది ఆశ్చర్యపోతూ….
నాకు ఒక సహాయం కావాలి నీ నుండి నువ్వు తప్పకుండా చేస్తావని నమ్మకంతో ఇస్తున్నాను ఎందుకంటే నీ కళ్ళలో నిజాయితీ కనిపిస్తుంది నాకు. మీ నాన్నగారి ప్రాణాలు కాపాడడానికి ఆరాటం కనిపిస్తుంది తప్పకుండా నా పని చేసి పెడతావని నమ్మకంతో ఇస్తున్నాను….
ఆ డబ్బులు చూడగానే బుజ్జి కళ్ళల్లో ఆనందం మెరుస్తూ ఇప్పుడు ఏం చేయాలి డబ్బు తీసుకోవాలా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది…..
చూడమ్మా నువ్వు ఏమీ భయపడవలసిన అవసరం లేదు నావల్ల నీకు ఎలాంటి ప్రమాదం జరగదు కేవలం నాకు నీ సమయం కావాలి అంతే దానికి నువ్వు సిద్ధపడితే ఈ డబ్బులు తీసుకో అమ్మ….
నాకు ఇప్పుడు మా నాన్నగారు ప్రాణాలు కాపాడమే ముఖ్యమండీ. మీరు ఏం చెప్పినా చేస్తాను ముందు డబ్బులు నేను కౌంటర్లు కట్టేసి వస్తాను అని అంటుంది ఏడుస్తూ బుజ్జి….
సరే వెళ్ళు తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అని కృష్ణమూర్తి బుజ్జి వెళ్లి కౌంటర్ దగ్గర డబ్బు కట్టేస్తారు ఆపరేషన్ థియేటర్లోకి వాళ్ళ నాన్నగారిని తీసుకెళ్లాక మనశ్శాంతిగా అనిపిస్తుంది బుజ్జికి….
అందరికీ సహాయం చేసి చివరికి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు మా వారు అసలు ఆయన మంచితనానికి దేవుడు వేసే శిక్ష ఇది…..అని మనసులో బాధపడుతూ ఉంటుంది శాంతి…..అలా బాధపడుతుండగానే ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లడం చూస్తుంది శాంతి….
అదంతా చూస్తున్న శాంతి ఏంటి ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్తున్నారు ఏం జరుగుతుంది అని కంగారుపడుతూనే డబ్బులు కట్టేసారా అని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది శాంతి….
శాంతి ఆశ్చర్యపోతూ డబ్బులు కట్టేశారా నర్స్ ని అడుగుతుంది ….మా ఆయన్ని ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తున్నారు అని అడుగుతుంది ….కంగారు… అవునండి మీ తరఫు వాళ్ళు ఎవరో కట్టారు అనిచెప్తుంది నర్స్ అప్పుడు వెంటనే శాంతి అనుకుంటుంది దామోదర్ కట్టేసి ఉంటాడు అని సంతోష పడుతూ ఉంటుంది……శాంతి…..
ఆపరేషన్ థియేటర్ కి షిఫ్ట్ చేసిన వాళ్ళ నాన్నను చూసి బుజ్జి కొంచెం సంతోషపడుతూ హమ్మయ్య అని మనసులో అనుకుంటూ ఉంటుంది……
ఇప్పుడే నీకు ప్రశాంతంగా ఉందా అని అడుగుతారు కృష్ణమూర్తి నవ్వుతూ….
చాలా ప్రశాంతంగా ఉంది అని అంటుంది బుజ్జి …… ఇప్పుడు చెప్పండి నేను మీకు చేయవలసిన సహాయం ఏంటి అని అడుగుతుంది….
కొన్ని రోజుల్లో నువ్వు మీ ఫ్యామిలీకి దూరంగా ఉండి …. మేము చెప్పింది చేస్తే సరిపోతుంది అని అంటాడు కృష్ణమూర్తి….
నేను మీకు ఎలాంటి సహాయం చేయగలను నాకు అర్థం కావడం లేదండి 10 లక్షలు డబ్బు నాకు ఇచ్చారు …పని అంటున్నారు అసలు నేనేం చేయాలి ఏదైనా తప్పుడు పని అయితే నా వల్ల కాదండి నేను అలాంటి అమ్మాయిని కాదు అలాగే నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగడం నాకు అస్సలు ఇష్టం లేదు….
అని భయపడుతూనే సమాధానం చెబుతుంది…..
మీ పేరు ఏంటో కూడా నాకు తెలియదు అంకుల్ కాకపోతే ఈరోజు మా నాన్న ప్రాణాలు కాపాడారు మీకోసం నా ప్రాణాలైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ….నేను ఎలాంటిదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాను…. అది ధర్మం అయితేనే …..అంకుల్ …..తప్పు చేసే విధంగా అయితే చేయలేను అని అంటుంది….
అదేంటమ్మా డబ్బులు తీసుకున్న తర్వాత ధర్మం ప్రకారమే చేస్తానంటున్నావ్. మాట మారుస్తున్నావా అని అంటాడు కృష్ణమూర్తి….
అంకుల్ నేను మాట మార్చడం లేదు నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదని చెప్తున్నాను నావల్ల ఇంకో తప్పు జరగకూడదని భయంతో అడుగుతున్నాను అని అంటుంది బుజ్జి …..
నువ్వు చేయబోయేది ఒక మంచి కార్యం కోసమేనమ్మ అది నీకు ముందు ముందు అర్థమవుతుంది అలాగే నిన్నే ఎంచుకోవడానికి కారణం కూడా తెలుస్తుంది నీకు….త్వరలో…..
మీ మాటలు నాకు అర్థం కావడం లేదు అంకుల్ అంతు పట్టడం లేదు కానీ నేను ఉన్న సమస్యలు మీ దగ్గర నుండి డబ్బులు తీసుకున్నాను అది మంచిగా చెడుకో నాకు తెలియడం లేదు కానీ నేను సిద్ధంగా ఉన్నాను మీరు చెప్పిన పనికి…..
నాకు చాలా సమస్యలు ఉన్నాయి అంకుల్ అని ఏడుస్తూ ఉంటుంది….
అసలు నీ సమస్య ఏంటి అని కృష్ణమూర్తి అడగడంతో తన ఎదుర్కొన్న సమస్యలు గతంలో జరిగిన తప్పులు మొత్తం అన్ని వివరంగా చెబుతుంది బుజ్జి……
ఇంత అమాయకంగా ఉన్నావేంటమ్మా తెలిసి చేసిన తెలియక చేసిన నీ తప్పు వల్ల నువ్వు సమస్యలు ఇరుక్కున్నావు అని అంటాడు కృష్ణమూర్తి…..
అవును అంకుల్ నేను అమాయకంగా చేశాను మోసపోయానో నాకు తెలియదు అంకుల్ కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నాకు డబ్బు చాలా అవసరం ఒక్క మా నాన్న ప్రాణాలు కాపాడడానికి మాత్రమే కాదు మా అక్క పెళ్లి జరగడానికి కూడా మీరు నాకు ఈ సహాయం చేసి పెడితే మీకోసం ఏదైనా చేస్తాను అంకుల్ అని కాలు పట్టుకుంటుంది….
అయ్యో కాలు మీద నుండి లేగు….అలా దీనంగా అడిగేసరికి మనసంతా ఏదోలా అయిపోతుంది కృష్ణమూర్తికి జాలి వేస్తుంది….
సరే నీ సమస్య నేను తీరుస్తాను అలాగే నాకు నీ జీవితంలో కొన్ని రోజులు కావాలి నీకు ఎలాంటి భయం అవసరం లేదు నువ్వేమీ తప్పు చేయడం లేదు …..నీవల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగదు సరేనా నన్ను నమ్ము అని అంటాడు కృష్ణమూర్తి…..
మీ కుటుంబానికి తెలియకుండా కొన్ని నెలలు మాత్రమే నువ్వు మా కోసం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి అంతే …..మీ కుటుంబానికి కూడా నా వల్ల ఎలాంటి హాని జరగదు సరేనా…..
సరే అంకుల్…
అలాగే ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి అని అంటాడు….కృష్ణమూర్తి……
సరే ఇది నా విస్టింగ్ కార్డు నీ దగ్గర ఉంచుకో అలాగే మీ అక్క పెళ్లి అయిపోయిన తర్వాత నన్ను మీట్ అవ్వు. మీ అక్క పెళ్లి కావాల్సిన డబ్బు అంత అరేంజ్ చేస్తాను అని చెప్పి అక్కడి నుండి కృష్ణమూర్తి వెళ్లిపోతాడు….
అంకుల్ మీరు నన్ను ఎందుకు అంత నమ్ముతున్నారు 10 లక్షలు మీరు ఇచ్చి కనీసం నా దగ్గర నుండి ఒక్క డాక్యుమెంట్ సైన్ కూడా తీసుకోలేదు……
నువ్వు చెప్పిన కథలో నీ నిజాయితీ నాకు అర్థమైంది నువ్వు తప్పు చేసి ఉండొచ్చు కానీ నువ్వు తప్పుడు మనిషివైతే కాదు కదా అందుకే నీ మీద నమ్మకం ఉంది నాకు అని …
మీరు నిజంగానే దేవుడు అని చెప్పి రెండు చేతులతో దండం పెడుతుంది కృష్ణమూర్తి కి బుజ్జి…..
బుజ్జి ఫేస్ చూసి కృష్ణమూర్తికి చాలా జాలేసి పాపం అమాయకురాలుగా ఉంది చూడడానికి మహాలక్ష్మి లా ఉంది… వెళ్ళొస్తానమ్మ అన్నట్టుగా తల ఊపి చిన్నగా … .నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతడు కృష్ణమూర్తి…
ఆపరేషన్ బయట టెన్షన్ పడుతూ కనిపిస్తూ ఉంటుంది శాంతి అలాగే బుజ్జి కూడా దూరం నుండి నాన్నకి ఏమి కాకూడదు ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని మనసులో దేవుని ప్రార్థిస్తూ ఉంటుంది…
ఆపరేషన్ సక్సెస్ ని డాక్టర్ చెప్పడంతో శాంతి సంతోష పడుతూ ఉంటుంది అదంతా విన్న దూరం నుండి చూస్తున్న బుజ్జి కూడా సంతోషపడుతుంది అప్పుడు అక్కడికి వచ్చిన దామోదర్ థాంక్స్ అన్నయ్య నీవల్లే ఆయన బతికారు సమయానికి డబ్బు సమకూర్చడం వల్లే అని అంటుంది శాంతి….
డబ్బులు నేను కట్టడం ఏంటమ్మా అని నోట్లో నుండి రాబోతుంటే అప్పుడు అక్కడికి వచ్చి బుజ్జి అది ఏంటి మావయ్య నువ్వే దగ్గరుండి డబ్బులు అన్ని కట్టావు కదా అని చెప్పి అంటుంది బుజ్జి…..
బుజ్జి ఎందుకు అలా అంటుందో అర్థం కాని దామోదర్ అయోమయంగా చూస్తూ
అమ్మకి ఏమి చెప్పొద్దు అంటూ సైగల్ చేస్తూ ఉంటుంది బుజ్జి…..
బుజ్జి సైగల్ అర్థం చేసుకున్న దామోదర్….
సరే నేను వెళ్లి డాక్టర్ తో మాట్లాడి వస్తాను శాంతి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతాడు దామోదర్…..
సరే అన్నయ్య అని చిన్న స్మైల్ తో అంటుంది శాంతి….
దామోదర్ బుజ్జి వైపు చూసి రమ్మని సైగల్ చేస్తాడు
అమ్మ నేను ఒక్కసారి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తాను అంటుంది బుజ్జి..
పోవె ఇక్కడ నుండి ముందు నా ఎదురుగుండా కనిపించకు అంటుంది కోపంగా శాంతి….అమ్మ కోపాన్ని చూసి బాధపడి అక్కడనుండి వెళ్ళిపోతుంది బుజ్జి
అసలు ఏం జరుగుతుంది బుజ్జి డబ్బులు ఎక్కడి నుండి కట్టావు? నేను కట్టానని చెప్తున్నావేంటి అ మ్మ కి అని అడుగుతాడు దామోదర్…
మావయ్య నేను చెప్పేది విను నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా కట్టాను… నేను కట్టాను అంటే అమ్మ ఒప్పుకోదు అలాగే నువ్వు కట్టినట్టే ఉంటూ మావయ్య లేకపోతే అమ్మ అనుమానిస్తుంది…..
సరే నీకు అంత డబ్బు ఇచ్చే స్నేహితులు ఎవరున్నారు అని అనుమానం వ్యక్తం చేస్తాడు దామోదర్ ఎవరో ఉన్నారులే మావయ్య ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న ఆపరేషన్ జరిగింది నాన్న కోలుకుంటున్నాడు అది చాలు అని అంటుంది…..బుజ్జి….
పది లక్షలు ఇచ్చే అంత ఫ్రెండ్స్ తనకు ఎవరున్నారు ఆలోచిస్తూ ఉంటాడు దామోదర్…..
********
కృష్ణమూర్తి తన ఫోన్ తీసుకుని ఆనందంగా ఫోన్ తీసుకుని మీరు అనుకున్నట్టే అమ్మాయి దొరికింది సార్ అని అంటాడు….
అవతల నుండి ఎత్తిన మనిషి నవ్వుతూ థాంక్స్ కృష్ణ మూర్తి గారు చెప్పిన పని మీరు కరెక్ట్ గా చేస్తున్నారు అని అంటాడు….
అమ్మాయి మన ఏం చెప్పిన చేయడానికి సిద్ధంగానే ఉంది కానీ ఒక షరతు మాత్రం చెప్పింది తను చేసే పని వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదని చెప్పింది సార్….
ఏంటి నా గురించి తెలిసి కూడా మీరు అమ్మాయి పెట్టిన కండిషన్ నాకు చెప్తున్నారా అంటాడు కోపంగా…..
ఆ అమ్మాయి షరతులు నాకు చెప్తారేంటి మనం కదా రూల్స్ పెట్టాల్సింది …మనం డబ్బులు ఇచ్చి మనం చెప్పినట్టు ఒప్పుకుని మనకి కండిషన్స్ పెట్టే అమ్మాయి ఏంటి అసలు ఏమనుకుంటుంది తన గురించి తను….
అసలు అమ్మాయి గురించి చెప్తుంటే నాకు అసలు నచ్చడం లేదు మీరు వేరే అమ్మాయిని చూడండి ఎందుకో నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది ఇచ్చిన మనీ కూడా రిటర్న్ తీసుకోండి అని అంటాడు అని అంటాడు సీరియస్‌గా….
కృష్ణమూర్తి భయపడి సార్ అలా అంటారు ఏంటి సార్ అమ్మాయి చాలా మంచిది డబ్బులు రిటర్న్ అంటే తను ఇప్పుడు ఇవ్వలేదు సర్ అలాగే పర్ఫెక్ట్ గా పనికి సరిపోతుంది ప్లీజ్ అర్ధం చేసుకోండి అంటాడు కృష్ణమూర్తి
సరే కృష్ణమూర్తి గారు మీ మీద ఉన్న గౌరవంతో నేను ఒప్పుకుంటున్నాను తనని ఎలా అయినా సరే ఇక్కడ తీసుకురండి అలాగే మనం ఇచ్చిన డబ్బులకి డాక్యుమెంట్ మీద సైన్ చేయించుకోండి అలాగే మనం ఏం చెప్పిన చేయడానికి రెడీగా ఉండాలి అని సీరియస్ గా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అజయ్…..
ఓకే సర్…. మీరు చెప్పినట్టే ఆ అమ్మాయిని ఒక మూడు రోజుల్లో అక్కడ ఉంటుంది అని అంటాడు……
డబ్బు కోసం ఏదైనా చేసే ఇలాంటి అమ్మాయిలు ఉండడం వల్లే అమ్మాయిలు మీద నమ్మకం పోతుంది అని కోపంగా అనుకుంటాడు….ఫోన్ పెట్టేసి….అజయ్…..
పాపం చూడడానికి అమాయకంగా ఉన్నా బుజ్జి ….పులి బోనులోకి అడుగుపెడుతుంది…. ఏం చేయమంటావ్ తల్లి తప్పడం లేదు….. నేను ఇది చేయాల్సిందే అని బాధపడతాడు మనసులో కృష్ణమూర్తి…..
******
If you like this episode please give comments
Swipe left/right or tap the sides to turn pages