Villan – 2
ఇంకో 24 గంటలు ఆయనకి మెలకువ వస్తుంది కంగారు పడవలసిన అవసరం ఏం లేదు అని చెప్పి డాక్టర్ వెళ్లిపోతాడు ఆ మాటలు వింటున్న శాంతి బుజ్జి అలాగే దామోదర్ సంతోషపడతారు
అపరేషన్ సక్సెస్ అవడంతో గట్టిగా ఊపిరి పీల్చుకుని ఆనందపడుతుంది బుజ్జి….
ఆ కృష్ణమూర్తిగారు ఎవరో గాని సమయానికి వచ్చి నాన్న ప్రాణాలు కాపాడారు ఆయన నేను తప్పకుండా సహాయం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో మాట తప్పకూడదు అని మనసు లో అనుకుంటుంది బుజ్జి….
బావగారు గురించి నువ్వు టెన్షన్ పడవలసిన అవసరం ఏమీ లేదు శాంతి అంత సవ్యంగా జరిగింది కదా ఇంకొక 24 గంటల ఇంటికి కూడా వచ్చేస్తారు అని అంటాడు నవ్వుతూ దామోదర్….
అన్నయ్య ఇదంతా నీ వల్లే నువ్వు దేవుళ్ళ వచ్చి ఆయన ప్రాణాలు కాపాడవు నీ రుణం ఎలా తీర్చుకోవాలి అన్నయ్య అని అంటుంది శాంతి….
మనలో మనకి రుణాలు ఏంట్రా ఇది నా బాధ్యత ….అని అంటాడు దామోదర్….
బుజ్జి వైపు కోపంగా చూస్తూ శాంతి అంత ఈ దయ్యం వల్లే వచ్చింది అన్నయ్య ఇది చేసే పనుల వల్ల ఈయన ప్రాణాల మీదకు వచ్చింది అని ఏడుస్తూ అంటూ ఉంటుంది శాంతి…
ఇప్పుడు ఆనందంగా కోలాహాలంగా ఉండవలసిన ఇల్లంతా ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయి ఏడుపులు ఉన్నాయి అంటే దానికి కారణం ఈ బుజ్జి అని చెప్పి తిడుతూ ఉంటుంది శాంతి….
శాంతి నువ్వు ఎందుకు అంత ఆవేశపడుతున్నావ్ ముందు నువ్వు కుదురుగా ఉండు బుజ్జి తప్పేం లేదు అని అంటాడు దామోదర్…
తప్పేం లేదా అన్నయ్య ఇది ఇంట్లో పెళ్లి కావాల్సిన అక్క ఉంటే పెళ్లికి ముందు ఇవ్వాల్సిన కట్నం డబ్బులు ఇది మాయం చేసింది తప్పు లేదంటావా అన్నయ్య అది తెలిసి ఈయనకి హార్ట్ ఎటాక్ రావడం తప్పు కాదంటావా అని అంటుంది ఆవేశంగా…శాంతి…
ఇలా జరుగుతుందని అది మాత్రం ఊహించిందా ఏంటి అంటారు దామోదర్….
అసలు బుద్ధుందా అన్నయ్య అసలు దీనికి వెర్రి ,పిచ్చి తనము లేకపోతే తింగరి తనం అర్థం కావడం లేదు మండిపోతుంది నాకు అని తిడుతూ ఉంటుంది శాంతి…
ఆ తిట్ల అన్నీ భరిస్తూ ఏడుస్తూ ఉంటుంది బుజ్జి….
నువ్వేం కంగారు పడొద్దు పెళ్లి కూడా సవ్యంగానే జరుగుతుంది ….అని అంటాడు ఓదార్పుగా దామోదర్….
తనాని ప్రాణంగా చూసుకునే అమ్మే తిడుతూ ఉంటే మనసులో కృంగిపోతూ బాధపడుతూ ఉంటుంది బుజ్జి….
బుజ్జి… అక్క భయపడుతూ ఉంటుంది నువ్వు ఇంటికి వెళ్ళు …అని అంటాడు దామోదర్…
లేదు మావయ్య నాన్నకు స్పృహ వచ్చాక వెళ్తాను అని కన్నీళ్లు తుడుచుకుంటూ అంటూ ఉంటుంది బుజ్జి…
అన్నయ్య ఇది నాకు కనిపించిందంటే నేనేం ఏం చేస్తానో నాకే తెలీదు చాలా కోపంగా ఉంది ముందు దీని ఇంటికి పంపించే అని అంటుంది శాంతి…..
బుజ్జిని బలవంతంగా ఇంటికి పంపించేస్తాడు దామోదర్….
వెళ్లలేక వెళ్తుంది బుజ్జి బాధగా అక్కడ నుండి…..
బుజ్జి వెళ్ళిపోయానా తర్వాత దామోదర్ పక్కన కూర్చున్న శాంతి తో మాట్లాడుతూ ఉంటాడు ఎందుకు శాంతి బాధపడుతున్నావ్ ఇంకా బావగారికి ఏమీ కాదు కదా అలాగే పెళ్లి కూడా అయిపోతుంది నేను వియ్యంకుడు తో మాట్లాడుతాను సరేనా అని అంటారు దామోదర్….
ఆయనకు స్పృహ వచ్చిన తర్వాత ఏమని చెప్పాలి అన్నయ్య బుజ్జి అంటే ….. ప్రాణం …..బుజ్జి వల్లే ఇంట్లో డబ్బులు పోయాయి అని తెలిస్తే ఆయన ఇంకా బాధపడతారు అని బాధపడుతూ ఉంటుంది శాంతి….
ఇంట్లో డబ్బులు లేవంటేనే ఆయనకు హార్ట్ ఎటాక్ వచ్చింది అన్నయ్య అది బుజ్జి వల్లే అని తెలిస్తే ఏమవుతుందో ఏంటో ఇంకా భయంగా ఉంది అని అంటుంది శాంతి….
నువ్వేం కంగారు పడొద్దు శాంతి ఏం కాదు బావగారు కి విషయం చెప్పొద్దు సరేనా పెళ్లి ఎలాగోలా జరిపిద్దాం. ఓకేనా అని అంటాడు….
ఎలా జరిపిస్తావ్ అన్నయ్య ఇప్పుడు మనకి 30 లక్షలు వరకు కావాలి కదా అని అంటుంది కంగారుగా శాంతి….
నేను ఏర్పాటు చేస్తాను శాంతి కాకపోతే అని ఆలోచిస్తూ ఆగిపోతాడు దామోదర్…
డబ్బులు ఏర్పాటు చేస్తానని శాంతి కొంచెం ఆనంద పడుతూనే భయపడుతూ అన్నయ్య నీ దగ్గర ఇంత డబ్బు ఎలా అని అడుగుతుంది….శాంతి….
అంటే శాంతి నా కొడుకు వెంకట్ ఉన్నాడు కదా వాడి పెళ్లి కోసమని చెప్పి దగ్గర దగ్గరగా 30 లక్షలు దాచుకున్నాడు ఆ డబ్బులు అడుగుతాను వాడిని అని అంటాడు దామోదర్…..
అయ్యో అన్నయ్య వెంకట్ పెళ్లి కోసం దాచిన డబ్బులు మాకు ఇచ్చేస్తే మరి వెంకట్ పెళ్లి అని అంటుంది కంగారుపడుతూ….
తర్వాత ఆలోచిద్దాంలే ఇప్పుడు వెంకట్ పెళ్లికి కంగారు ఏముంది అని అంటాడు దామోదర్….
(మూడు నెలల క్రితం శాంతి దగ్గరికి వచ్చి దామోదర్ అడిగింది శాంతి గుర్తొస్తుంది బుజ్జి ని మన వెంకట కి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా చెల్లెమ్మ అని అంటాడు దామోదర్ …వెంకట్ అంటే నాకు ఇష్టమే అన్నయ్య ముందు శైలజ కి పెళ్లి అవ్వకుండా బుజ్జి కి పెళ్లి అంటే
శైలజ పెళ్లయిన తర్వాతే బుజ్జికి వెంకట్కి పెళ్లి చేద్దాం అని అంటాడు దామోదర్ ఆశగా…
నువ్వు ఇంతలా అడుగుతుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అన్నయ్య ఉన్నది అని అసలు విషయం చెప్తుంది శాంతి
ఏమి అనుకోకు అన్నయ్య ఎందుకో బుజ్జికి వెంకట అంటే అసలు ఇష్టం లేదు అని అంటుంది…..ఒకసారి నేను ఎంతో ఆశపడి బుజ్జి ని అడిగితే ఇష్టం లేదు అని సమాధానం చెప్పింది దానికి ఇష్టం లేకుండా పెళ్లి చేయలేము కదా అన్నయ్య నన్ను క్షమించు అని అంటుంది శాంతి
బుజ్జి కి ఇష్టం లేకపోతే నువ్వు మాత్రం ఏం చేయగలవులే నేను ఏదో ఒకటివెంకట్ కి చెప్పుకుంటాను అని చెప్పి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతాడు దామోదర్
శాంతి మూడు నెలల క్రితం జరిగిన సంఘటన గుర్తు చేసుకుని మనసులో బాధపడుతూ పాపం అన్నయ్య నా దగ్గరికి వచ్చి బుజ్జిని అడిగాడు. కానీ బుజ్జికి ఇష్టం లేదని నేను ఒప్పుకోలేదు అని అనుకుని ఒక నిర్ణయం తీసుకునే దానిలాగా దామోదర్ దగ్గరికి వెళ్తుంది….
శాంతి దామోదర్ దగ్గరికి వచ్చి అన్నయ్య ఇప్పుడు చెబుతున్నాను విను వెంకట్ కి బుజ్జి కి పెళ్లి చేస్తాను ….
కానీ బుజ్జికి ఇష్టం లేదని చెప్పావు కదరా … ఇప్పుడు ఆ మాటలని ఎందుకు…
లేదు అన్నయ్య ఇప్పుడే మీకు మాట ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడే నీ వల్లే ఈ రోజు మా వారు ప్రాణాలు అలాగే శైలజ పెళ్లి జరుగుతుంది అంటే దానికి కారణం నువ్వే అన్నయ్యా ఇంకేం ఆలోచించొద్దు అన్నయ్యా బుజ్జి నీ కోడలే నువ్వు ఆశ పడినట్టు ….
ఇప్పుడే సహాయం చేసినందుకా చెల్లి అని అంటాడు దామోదరు అందుకు కాదు అన్నయ్య బుజ్జి ఒక తింగరిది దాని లైఫ్ బాగుండాలంటే వెంకట్ కరెక్ట్ మొగుడు దానికి….
అది చేసి పిచ్చి పిచ్చి పనుల వల్ల ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తుంది అని అంటుంది శాంతి….
మరి బుజ్జి ఏమంటుందో ఏమో వద్దు అని అంటాడు దామోదర్….
దాని మొహం అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పెళ్లి జరుగుతుంది అన్నయ్య …..
దామోదర్ సంతోషపడుతూ చాలా సంతోషంగా ఉంది చెల్లి ఇప్పుడే నాకు మనశాంతిగా ఉంది బుజ్జి అంటే వెంకట్ కి చాలా ఇష్టం అసలు బుజ్జిని పెళ్లి చేసుకోలేకపోతున్నాను అని వాడు ఎంత బాధ పడుతున్నాడో తెలుసా ఈ విషయం తెలిస్తే వాడు ఎగిరిగంతేస్తాడు….
మరి బావగారి ని ఎలా ఒప్పిస్తావ్ చెల్లి అని అడుగుతాడు దామోదర్ …
అంత నేను చూసుకుంటాను అన్నయ్య శైలజ పెళ్లి అయిపోయిన తర్వాత….
అంటే పెళ్లిరోజే మనం తాంబూలాలు కూడా మార్చేసుకుందాం అన్నయ్య ఫిక్స్ అయిపోండి మీరు అని చెప్తుంది నేను మాటంటే మాటే కదా అన్నయ్య అని అంటుంది శాంతి నా ప్రాణం పోయినా మాట తప్పను అని అంటుంది శాంతి….
చాలు శాంతి ఈ ఒక్క మాట చాలు అని సంతోషంగా చేతులు పట్టుకుంటాడు….
నువ్వు చేసిందానికి నేను చేసింది చిన్నదే అన్నయ్య …
అన్నయ్య నిజం చెప్పాలంటే బుజ్జి లైఫ్ కూడా బాగుంటుంది అని అంటుంది శాంతి…..
సరే శాంతి నువ్వు ఇక్కడ కూర్చుని రెస్ట్ తీసుకో నేను వెళ్లి ఒకసారి డాక్టర్ తో మాట్లాడి వస్తానని చెప్పి దామోదర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు….
దామోదర్ ఫోన్ తీసుకుని సంతోషంగా వెంకట్ కి ఫోన్ చేస్తాడు….
వెంకట్ ఫోన్ కోసం ఎదురు చూస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు….
ఫోన్ రాగానే ఆనందంగా ఫోన్ లిఫ్ట్ చేసి నాన్న నీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను ఏంటి సంగతి గుడ్ న్యూస్ ఏ నా అని అడుగుతాడు వెంకట్….
మై డియర్ సన్ నువ్వు కోరుకున్నట్టే నీకు బుజ్జి కి త్వరలోనే పెళ్లి జరగబోతుంది సంతోషమే నా మనం అనుకున్నట్టే ప్లాన్ వర్కౌట్ అయింది అని ఆనందంగా cunning నవ్వుతూ అంటాడు దామోదర్…..
నాకు తెలుసు నాన్న నువ్వు మా మంచి నాన్న వి..
సరేగాని అసలు అత్త ఎలా పెళ్లికొప్పుకుంది బుజ్జిగా అసలు ఇష్టం లేదు కదా అని అడుగుతాడు డౌట్ గా వెంకట్…
నేను అనుకున్నది ఒక్కటి అక్కడ జరిగింది ఒకటి మై డియర్ సన్ ఎలాగో బావగారు కి డబ్బులు కావాలి కాబట్టి అరేంజ్ చేసి ఎలా అయినా సరే చెల్లి దగ్గర మంచి పేరు కొట్టి బుజ్జిని అడగాలనుకున్నాను కానీ ఏం జరిగిందో తెలుసా బుజ్జి డబ్బులు ఏర్పాటు చేసింది అలాగే పెళ్లి కావాల్సిన డబ్బులు కూడా నేనే ఏర్పాటు చేస్తాను మావయ్య నువ్వే చేసినట్టు అమ్మకు చెప్పు నాకు చెప్పింది…
వెంకట్ ఆశ్చర్యపోతూ అసలు బుజ్జికి అంత డబ్బు ఎవరిచ్చారు నాన్న అసలు అర్థం కావడం లేదు అని ఆశ్చర్యంగా అంటాడు….వెంకట్
అదే నాకు అర్థం కావడం లేదు వెంకట్ …
బుజ్జికి అంత డబ్బు సహాయం చేసే స్నేహితులు ఎవరున్నారు అయినా బుజ్జి కి అంత డబ్బులు ఎలా ఇస్తారు …అంటాడు…వెంకట్
అదే నేను ఆలోచిస్తున్నాను….. కానీ మన పని అయింది కదా నీకు బుజ్జి కి పెళ్లి జరుగుతుంది ఎలాగో బుజ్జి ఆ డబ్బులు తనే ఇచ్చిందని చెప్పదు ఎందుకంటే ఆ డబ్బులు ఎలా వచ్చాయో వాళ్ళ అమ్మ అడిగితే ప్రశ్నకు ఆన్సర్ లేదు బుజ్జి దగ్గర సో అది మనకు ప్లస్ పాయింట్ సో మనం భయపడవలసిన అవసరం లేదు ముందు మీ పెళ్లి అయిపోనివ్వు అప్పుడు ఆలోచిద్దాం అని అంటాడు….దామోదర్…
సర్లే నాన్న అది డబ్బులు తెచ్చింది మన డబ్బులు ఇవ్వకుండానే మన పని అయిపోయింది ఇవన్నీ మనకెందుకులే…. కానీ….. ఇప్పుడే నాకు బుజ్జిని పెళ్లి చేసుకోవాలని ఉంది నాన్న కాకపోతే కంపెనీ వర్క్ పని మీద ఆరు నెలలు నేను ఫారెన్ ఉండవలసి వస్తుంది రావడానికి సిక్స్ మంత్స్ పడుతుంది కదా అందుకే బాధగా ఉంది అని అంటాడు వెంకట్…..
దామోదర్ మాట్లాడుతూ … ఇంకా ఎంత 6 months ఇట్టే గడిచి పోతాయి
శైలజ పెళ్లి లోనే తాంబూలాలు కూడా మార్చేసుకుంటాం ఇంకా సగం పెళ్లయిపోయినట్టే …. బుజ్జికి నీకు తప్పకుండా పెళ్లి జరుగుతుంది ……
సరే నాన్న నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది పార్టీ చేసుకోవాల్సిందే సరే నాన్న ఉంటాను ఆఫీస్ వర్క్ ఉంది అని ఫోన్ పెట్టేస్తాడు వెంకట్…
చిన్నప్పుడు జరిగిన సంఘటన వెంకట్ గుర్తు చేసుకుంటూ నన్ను చెంప మీద కొట్టావు కదే ఇప్పుడు నీ జీవితం మీద దెబ్బ కొడతాను నిన్ను పెళ్లి చేసుకుని ఏడిపిస్తాను అని వెంకట్ హ్యాపీగా మనసులో అనుకుంటూ ఉంటాడు…
నిన్ను నా చేతుల నుండి ఎవ్వరు కాపాడలేరు అని మనసులో నవ్వుకుంటూ ఉంటాడు వెంకట్….
@@@@@
If you like episode please give your valuable comments…..
Swipe left/right or tap the sides to turn pages