New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Villan – 4
Villan 10 min read

Villan – 4

పక్కన వాటర్ తీసుకుని గడగడ తాగుతూ ఉంటుంది బుజ్జి….

పక్కనున్న దివ్యని తడుతూ అసలు దివ్య ఏం చెప్పారే ఆయన….ప్రేమించినట్టు నటించమంటున్నారు ఏంటి నాకేం అర్థం కావడం లేదు నీకు ఏమైనా అర్థమైందా అని అంటుంది అమాయకంగా చూస్తూ బుజ్జి …..

అప్పుడే షాక్ నుండి తెరుకున్న దిివ్య కూడా అవునే అసలు నాకేం అర్థం కావడం లేదు ……

ఒక్కటి మాత్రం అర్థమైంది నువ్వు పోయి పోయి పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కుపోతున్నావని…..అని అంటుంది దివ్య

నాకేం అర్థం కావడం లేదు దివ్య నేను ఒక్కడిని ప్రేమించి నటించి మోసం చేయడం ఏంటే నావల్ల అవుతుందా అసలు నేను ఒకరితో మాట్లాడాలంటే భయపడుతూ ఉంటాను అలాంటిది నేను ఇలాంటి పని ఎలా చేస్తానే అని ఏడుపు మొహం పెడుతుంది బుజ్జి……

లేదు….. నేను చేయలేను ఈ తప్పు అసలు చేయలేను ఈ విషయం అమ్మకు తెలిస్తే నన్ను చంపేస్తుంది …. భయంగా అంటుంది బుజ్జి……..

మరి ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడతావే 80 లక్షల అంటే అమ్మో అసలు మనం కట్టగలమా అని అంటుంది దివ్య……

యాంగ్సైటి తో నా గుండె చూడు ఎలా కొట్టుకుంటుందో అని భయంగా చెబుతూ ఉంటుంది బుజ్జి…..

సరే ఇంటికి వెళ్లి తీరిగ్గా ఆలోచిద్దామే ముందు ఇక్కడ నుండి వెళ్దాం పద అని రెస్టారెంట్ నుండి ఇంటికి బయలుదేరుతారు దివ్య అలాగే బుజ్జి……….

ఇంటికి వచ్చి ఇద్దరూ కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు…..

దివ్య నాకు మెంటల్ వచ్చేలా ఉంది ఏం చేయాలో అర్థం కావడం లేదు ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి అని ఏడుస్తూ ఉంటుంది……బుజ్జి…….

అసలు నీకు బ్రెయిన్ లేదే బుజ్జి ఎప్పుడు ఏదో పిచ్చి పనులు చేస్తూనే ఉంటావు అసలు ఆ రోజు డబ్బులు జాగ్రత్తగా తీసుకెళ్లి ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదు కదా అని అంటుంది దివ్య…..

రోడ్డుమీద మనిషి కళ్ళు తిరిగి పడిపోతే సహాయం చేయడం కూడా తప్పేనా …..అని అమాయకంగా మాట్లాడుతూ…….. నేను జాగ్రత్తగా పెట్టుకున్నానే…… కావాలని ఎవరో చేశారేమో నాకు అనుమానంగా ఉంది అని అంటుంది బుజ్జి….

సాయం చేయడం తప్పు కాదే నీ దగ్గర డబ్బులు ఉన్నాయని జాగ్రత్త పడాలి అని అంటుంది దివ్య…..

అవును నా తప్పే కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అంటుంది బుజ్జి….

ఈ పని నేను చేయలేను అని చెప్పి 40 లక్షలు ఎలా అయినా తీసుకొచ్చి ఇచేస్తానని చెప్తా ఏదైనా ఉద్యోగం చేసి లోన్ పెట్టుకుని money తీర్చేస్తాను అని అంటుంది బుజ్జి….

వాళ్లు ఒప్పుకుంటారని నేను అనుకోవడం లేదు నిన్ను 80 లక్షలు కట్టమంటారు గ్యారెంటీగా మరి కడతావా అని అడుగుతుంది…..

అన్ని డబ్బులా నా వల్ల కాదే ఏదోటి వాళ్లు కాలు పట్టుకుని బతిమాలుతానే అంటుంది బుజ్జి….

సరే అయితే ఏదో ఒకటి చేసి …..వాళ్లే మనం బ్రతిమాలి ఒప్పిదం సరేనా నువ్వేం కంగారు పడకు అని అంటుంది దివ్య….

సరే డీటెయిల్స్ ఏంటో కూడా చూడలేదు ఫైల్ ఓపెన్ చేసి చూస్తాను అని అంటుంది దివ్య…..

ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడం కూడా అనవసరమే నేను ఎలాగో చేయను కాబట్టి అని అంటుంది….బుజ్జి….

డీటెయిల్స్ చూద్దామనుకున్న దివ్య సర్లే అని చెప్పి ఫైల్ చూడకుండా పక్కన పెట్టేస్తుంది…..

అలా ఇద్దరు కొంచెం సేపు మాట్లాడుకుని డిన్నర్ చేసి పడుకున్నారు….

********

మరో చోట వెంకట్ డ్రింక్ చేస్తూ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఒరేయ్ నా పెళ్లి ఫిక్స్ అయింది రా చిన్నప్పటినుండి ఆశ పడుతున్న నా మరదలు తోనే ఫిక్స్ అయింది అని ఆనందంగా చెప్తూ ఉంటాడు…..

అదేంట్రా మీ మరదలు నువ్వంటే ఇష్టం లేదని చెప్పావు కదా ఎలా పెళ్లికొప్పుకుంది అని అంటాడు ఒక ఫ్రెండ్….

ఇప్పటికి కూడా ఇష్టం లేదురా చిన్నప్పుడు దానికి నాకు అస్సలు పడేది కాదు నేను ఏ తప్పు చేసిన ఇంట్లో చెప్పేసేది….వాళ్ళ అమ్మ బలవంతం చేయడంతో ఒప్పుకుంది ఇంకేం చేస్తుంది అని అంటాడు వెంకట్……

అదంటే నాకు చిన్నప్పటి నుండి ఇష్టం రా ….పెద్దయ్యాక చాలా అందంగా మారిపోయింది చూస్తేనే ముద్దొచ్చేసే అంతా……

నా చదువులు అంతా ముగించుకున్న తర్వాత ఇంటికి వెళ్లి చూస్తే చాలా అందంగా మారిపోయింది నా మరదలు అందుకే ఎలా అయినా సరే తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాను. చిన్నప్పుడు నన్ను కొట్టి అవమానించింది కాబట్టి కసి కూడా తీసుకోవాలి అనిపిస్తుంది అని అంటాడు వెంకట్…..

నా మరదలు బుజ్జి అంటే ఇంట్లో అందరికీ ఇష్టం అందుకే ముందు దాని మీద ఇష్టం పోగొట్టాలని ఇంట్లో వాళ్లందరికీ దాని మీద కోపం రావాలని…..నా మరదల్ బ్యాంక్ వెళ్తుందని తెలిసుకుని తన దగ్గర నుండి డబ్బులు కొట్టేంచేసాను నా ఫ్రెండ్స్ ద్వారా…..

ఆ డబ్బు మా నాన్నగారు ద్వారా ఇప్పించి తనని లాక్ చేయాలని అనుకున్నాను….. నాతో పెళ్లి కి ఒప్పించే లాగా …అనుకున్నాను…..

కానీ అనుకోకుండా డబ్బులు తనే ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇచ్చింది కానీ చివరికి మా నాన్న ఇచ్చినట్టు బిల్డప్ ఇవ్వడంతో ఇంకా నాకు తన కి పెళ్లి ఫిక్స్ అయిపోయింది అని అంటాడు వెంకట్…….

మొత్తానికి ఎలా అయితే రా నువ్వు నీ మరదల్ ని పెళ్లి చేసుకుంటున్నావు సాధించబోతున్న కంగ్రాట్స్ అని అందరు ఫ్రెండ్స్ డ్రింక్ చేస్తూ వెంకట్ ని పొగుడుతూ ఉంటారు అలా వెంకట్ తాగుతూ హ్యాపీ ఫీలవుతూ ఉంటాడు….

******

దివ్య నిద్ర పట్టకుండా ఆలోచిస్తూ అసలు 40 లక్షల పే చేసి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమలో పడేయడమేంటి 10,000 …….20,000….. ఇస్తే చాలా మంది అమ్మాయిలు వస్తారు కదా act చేయడానికి అని ఆలోచిస్తూ ఉంటుంది….

రెస్టారెంట్లు చూసిన వ్యక్తి కూడా చాలా ఫేమస్ పర్సన్ అయ్యుంటాడు ఎక్కడో చూసాను గుర్తు రావడంలేదు ముందు ఫైల్ ఓపెన్ చేస్తే డీటెయిల్స్ తెలుస్తాయి అసలు వాళ్ళు ఎవరో తెలుసుకోవచ్చు…..

దివ్య అజయ్ ఇచ్చిన పైల్ ఓపెన్ చేసి అందులోని డీటెయిల్స్ ని పూర్తిగా చూస్తూ ఉంటుంది…..

అ ఫైల్ లో ఉన్న పర్సన్ డీటెయిల్స్ అన్ని చూసి భయపడుతూ వామ్మో ఈ చండశాసనుడినా బుజ్జి ప్రేమలో పడేయాలి అని అనుకుంటుంది మనసులో దివ్య……

వామ్మో పెద్ద ఊబిలోని కొరుకుపోయిందిగా బుజ్జి అని భయపడుతూ బుజ్జి లేగు నిద్రపోతున్నావు ఇంత టెన్షన్ లో అని దివ్య లేపుతూ ఉంటుంది…..

దివ్యా నన్ను నిద్ర లేపకే బాగా నిద్ర వస్తుంది రేపొద్దున మాట్లాడుకుందాం లే నాకు నీరసంగా ఉంది అనిఖ అంటుంది బుజ్జి….

ఒసేయ్ పెద్ద trap లో పడ్డావే నువ్వు…. పిచ్చిదానిలా నిద్రపోతున్నావు ముందు నేను చెప్పేది విను అని అంటుంది దివ్య కోపంగా….

కళ్ళు నలుపుకుంటూ బద్ధకంగా నిద్ర లేచి బుజ్జి….చెప్పవే అని అంటుంది…

చెప్పు ఎందుకే మంచి నిద్ర లో నన్ను డిస్టర్బ్ చేసావ్ అని అడుగుతుంది బుజ్జి క్యూట్ గా……

నువ్వు ప్రేమలో పడేయవలసిన పర్సన్ ఎవరో తెలుసా? ఒక బిగ్ షాట్ …..ఆయన పేరు వింటేనే అందరూ భయపడిపోతారే ఆయనకి ఒక పేరు కూడా పెట్టరు కార్పొరేట్ వాళ్ళందరూ కలిసి ఏం పేరు తెలుసా villan…..

ఏమిటి అని కళ్ళు పెద్దవి చేస్తుంది బుజ్జి….

రీసెంట్గా ఆయన గురించి నేను ఒక ఆర్టికల్ కూడా చదివాను ఆయన చాలా స్ట్రిక్ట్ , arrogant , most stylish business man , recent sensation person Vikram Aditya……బిజినెస్ ఎక్సలెన్స్ award రీసెంట్ గా తీసుకున్నారు…..

విక్రమాదిత్య గురించి చాలా గ్రేట్ గా చెబుతూ ఉంటుంది దివ్య….

బుజ్జి అవని వింటూ టెన్షన్ పడుతూ shiver అవుతూ ఏంటి ఇంత గ్రేట్ పర్సన్ నేను లవ్ లో పడేయాలా ఆయన మీటివ్వడానికే మనకి ఒక టెన్ డేస్ పడుతుంది ఏమో అపాయింట్మెంట్ రావడానికి అని అంటుంది బుజ్జి కళ్ళు పెద్దవి చేసి…..

 ఆయన చాలా స్ట్రిక్ పర్సని మనం చూశారంటే స్కాన్ చేసి మనం ఏం తప్పు చేసామో కూడా కనిపెట్టేస్తారు మన బాడీ లాంగ్వేజ్ బట్టి……

ఆయన దెబ్బ కొట్టడానికి చాలామంది ట్రై చేశారు బిజినెస్ field లో అది అవ్వక ఇలా నిన్ను ట్రాప్ చేశారు అనిపిస్తుంది అసలు మన దగ్గరకు వచ్చిన పర్సన్ గురించి internet లో సెర్చ్ చేశాను ఆయన అజయ్ వర్మ……

వన్ ఆఫ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ AK కంపెనీస్….

ఆశ్చర్యపోయి బుజ్జి కళ్ళు పెద్దవి చేసి AK కంపెనీసా ఎక్కడ విన్నాను ఈ పేరు చాలా ఫేమస్ కదా అని అంటుంది….

అర్జున్ కళ్యాణ్….విక్రమాదిత్య కంపెనీస్ రాకముందు ఆయన ది బెస్ట్ కంపెనీ ఫైవ్ ఇయర్స్ గా ఓడిపోతున్నారు సెకండ్ ప్లేస్ లో ఉంటున్నారు అని అంటుంది…..

కొన్ని సంవత్సరాలుగా బిజినెస్ పరంగా వీరిద్దరికీ చాలా పోటీ జరుగుతుంది…..

నిన్ను అడ్డుపెట్టుకుని విక్రమాదిత్యాన్ని down fall చేయాలని ప్లాన్ వేసి ఉంటారు ….. నాకు తెలిసినంతవరకు….

అప్పుడు బుజ్జి గట్టిగా నవ్వుతూ పిచ్చి మొహాలు కాకపోతే అంత పెద్ద వ్యక్తి నన్ను ఎందుకు ప్రేమిస్తాడే పిచ్చి కాకపోతే అసలు 40 లక్షలు వేస్ట్ వాళ్ళకి అని అంటుంది….

వాళ్లేమి తెలివి తక్కువ అయితే కాదే ఏదో పెద్ద ప్లాన్ వేసే నిన్ను అక్కడ పంపాలనుకుంటున్నారు నేనైతే….అదే అనుకుంటున్నాను అని అంటుంది దివ్య….

వాళ్ళు ఏం ప్లాన్ వేసుకున్నా మనకి అనవసరం నేనైతే ఆ పని చేయను కదా వాళ్ళు ఏం చేసినా సరే నేను అయితే యాక్సెప్ట్ చేయను అని అంటుంది బుజ్జి……..

నిద్రొస్తుంది మార్నింగ్ లేచి కృష్ణమూర్తి గారికి నేను చేయను అని చెప్పేసి ఏదో ఒక రకంగా 40 లక్షలు పే చేస్తాను అని చెప్పి …..బుజ్జి నిద్రపోతుంది…….

బుజ్జి అంతా ఈజీగా అనిపిస్తుంది గానీ పెద్దవాళ్లతో వ్యవహారం ఈ బుజ్జి ఎలాంటి ప్రమాదంలో ఇరుక్కుంటుందో ఏంటో అని మనసులో ఆలోచించుకుంటూ ఉంటుంది దివ్య….

*****

సిటీ అవతల ఒక పెద్ద రిసార్ట్లో పార్టీ జరుగుతున్న ప్రదేశం అది……

అందరూ డ్రింక్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు నైట్ పార్టీని……

కానీ ఒక రూమ్ లో ఒక ఐదుగురు రౌడీ ఒక వ్యక్తిని చాలా దారుణంగా కొడుతూ ఉంటారు….

సర్ నన్ను చంపొద్దు సార్ నేను ఎలాంటి తప్పు చేయలేదు నన్ను క్షమించండి అని ఏడుస్తూ అంటాడు…..

అదంతా ఒక వ్యక్తి కాలు మీద కాలు వేసుకుని కోపం గా ఆ వ్యక్తి వైపు చూస్తూ ఉంటాడు……

ఆ దెబ్బలకు భయపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి అర్జున్ కళ్యాణ్ కాలు పట్టుకుని క్షమించండి నేను ఎలాంటి తప్పు చేయలేదు అని ఏడుస్తూ ఉంటాడు…

అర్జున్ కోపంగా “ఏయ్, నా పాదాలను తాకడానికి నీకు ఎంత ధైర్యం” అని కాలును విదిలించుకుంటాడు…..

క్షమించండి సార్ నన్ను విడిచిపెట్టండి నా తప్పేమీ లేదు మా మేనేజర్ ఒప్పుకోలేదు సార్ అందుకే ప్రాజెక్ట్ విక్రమాదిత్య గారికి వెళ్ళింది అంటూ ఉంటాడు……

నీ తప్పు లేదు నాకు తెలుసు రా కాకపోతే నువ్వు సరిగ్గా ప్రయత్నం చేయలేదు అందుకే నాకు నీ మీద కోపంగా ఉంది. నీ మేనేజర్ లాభాల కోసం ఆలోచిస్తాడు కానీ నువ్వు నా గురించి ఆలోచించాలి కదా ఇంకా గట్టిగా ప్రయత్నం చేయాలి కదా….

 ఆ మాటలు ఆ వ్యక్తి భయపడుతూ సర్ ఇప్పుడు ఎలా అయినా సరే మా మేనేజర్ నేను ఒప్పిస్తాను సార్ నన్ను మాత్రం చంపొద్దు సార్ అని అంటాడు….

సరే నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్న నీ మేనేజర్ కి ఫోన్ చేసి ఎలా అయినా సరే ఈ ప్రాజెక్టు మా కంపెనీకి వచ్చేలాగా చెయ్ లేదంటే నీ ప్రాణాలతో పాటు నీ ఫ్యామిలీ ప్రాణాలు కూడా పోతాయి అని బెదిరించి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు అర్జున్ కళ్యాణ్…….

******

వేర్ రూంలో అజయ్ కూర్చుని అర్జున్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అర్జున్ రాగానే…..హాయ్ AK అని అంటాడు…..

హాయ్ రా ఎక్కడ వరకు అయింది మన పని ఆ అమ్మాయి తో మాట్లాడావా అని అడుగుతాడు…….

ఎస్ …… AK……బట్ తను మన పని చేయడానికి ఒప్పుకోదేమో అనిపిస్తుంది ఎందుకంటే చాలా అమాయకంగా ఉంది…..

అర్జున్ కళ్యాణ్ సీరియస్ గా look ఇచ్చి ఏమంటున్నావ్? మనం నలభై లక్షలు పే చేసాం అమ్మాయి చేయదంటే దాని అర్థం ఏంటి అని అంటాడు….

కావాలంటే ఇంకా డబ్బు పే చేద్దాం కానీ ఆ అమ్మాయి ఒప్పుకోవాలి అని అంటాడు అర్జున్….

అమ్మాయి డబ్బుకి లొంగి పోయే రకంగా కనిపించడం లేదు వాళ్ళ నాన్న ట్రీట్మెంట్ కోసం డబ్బులు తీసుకుంది గాని డబ్బుల కోసం ఏదైనా చేసే అమ్మాయిల లేదు అని అంటాడు….అజయ్…..

వేరే అమ్మాయిని చూస్తాను అర్జున్ నువ్వు కంగారు పడకు ఆ అమ్మాయి దగ్గర నుండి మన 40 లక్షలకు కూడా నేను రికవరీ చేస్తాను కదా ….. ఎందుకంటే ఆ అమ్మాయి అమాయకురాలు అలాగే భయస్తురాలు కూడా అని అంటాడు అజయ్….

అసలా కృష్ణమూర్తి గారు ఈ అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేశారు అని ఆలోచిస్తూ ఉంటాడు అర్జున్….

ఒకసారి అంకుల్ ఫోన్ చెయ్ మాట్లాడాలి అని అంటాడు సీరియస్గా అర్జున్….

ఒరేయ్ నైట్ అంకుల్ డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదేమో అని అంటాడు అజయ్ ఇప్పుడు టైం 4:00 అయింది పర్వాలేదు అంకుల్ త్వరగా నిద్ర లేచే మనిషి….

కృష్ణమూర్తి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అజయ్…

అంకుల్ మాట్లాడేది అర్జున్ అని అంటాడు….

చెప్పు అర్జున్ ఎలా ఉన్నావ్ ఏంటి ఈ టైం లో కాల్ చేసావ్ any thing అర్జెంట్ అని అంటాడు కృష్ణమూర్తి……

మీరు ఎప్పుడు నుండి డాడీ ఫ్రెండ్ కాబట్టి అలాగే మా కంపెనీలో నమ్మకమైన వాళ్ళు కాబట్టి…

ఒక హెల్ప్ అడిగాను విక్రమాదిత్యాన్ని నాశనం చేయడానికి దానికి మీరు ఒక అమ్మాయిని సెట్ చేస్తానని చెప్పి ఒక భయస్తురాలు పంపించారు ఏంటి అని అంటాడు అర్జున్….

అర్జున్ నేను చెప్పినట్టు వేరే అమ్మాయి అయితే విక్రమాదిత్య ఆస్తిని చూసి టెంప్ట్ అయ్యి పెళ్లి కూడా చేసేసుకుంటుంది కానీ ఈ అమ్మాయి అలా కాదు తన డబ్బు మీద ఆశ లేదు అంత వాళ్ళ ఫ్యామిలీ కోసమే చేసింది….

అలాగే అమ్మాయికి ఆల్రెడీ వాళ్ళ బావతో పెళ్లి కూడా ఫిక్స్ అయింది వాళ్ళ అమ్మ మాట కాదు అని చేసుకోదు అలాగే ఏదేమైనా సరే అమ్మాయి విక్రమాదిత్య దగ్గర మన విషయాలు చెప్పలేదు ఎందుకంటే ఆ అమ్మాయి భయస్తురాలు కాబట్టి అమ్మాయికురాలు కూడా సో చెప్పిన పని చేస్తుంది భయంతో…..

ఏంటి ఒక మనిషి భయం పడుతూ ఏదైనా చేస్తాడా …

నెవ్వరు అంకుల్ ….. 

నువ్వే ఆలోచించు….నెమ్మదిగా అర్థమవుతుంది …… బుజ్జి ని పనిచేస్తుంది నువ్వు కంగారు పడకు అని ఫోన్ పెట్టేస్తాడు కృష్ణమూర్తి…..

ఆ మాటలు వింటున్న అర్జున్ అలాగే అజయ్ ఏమీ అర్థం కాక ……ఏంటి అంకుల్ ….భయంతో ఏదైనా చేస్తుంది అని అంటున్నారు అని ఆలోచిస్తూ ఉండగానే ఒక వ్యక్తి రౌడీ వచ్చి సర్ మీ ప్రాజెక్టు మీకు ఓకే అయింది అని నవ్వుతూ చెప్తాడు….

వాట్ 15 నిమిషాల్లో ఆ మేనేజర్ ని ఒప్పించేసాడా వాడు అని అంటాడు అర్జున్ ఆశ్చర్యపోతూ…. అవును సార్…. ఎంతైనా భయం ఒక వ్యక్తి చేత ఏదైనా చేయిస్తుంది సార్ అని చెప్పి…..రౌడీ…వెళ్లిపోతాడు….

నిజమే అంకుల్ చెప్పింది భయంతో ఏ మనిషి అయినా ఏ పనైనా చేస్తాడు భయపెట్టాలి ఎస్ అని అంటాడు అర్జున్….

అజయ్ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఆ అమ్మాయి విక్రమాదిత్య దగ్గరికి వెళ్ళాలి……

 విక్రమాదిత్య నాశనానికి ఈ అమ్మాయి మనకు సహాయం చేయాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఆ అమ్మాయి కావాల్సిన అవసరాలన్నీ మనం చూసుకుందాం తను అక్కడికి వెళ్లడానికి అంతా ఏర్పాటు చెయ్ అని అంటాడు……..అర్జున్……

ఓకే …… AK…… ఏదో ఒక లాగా అమ్మాయిని బెదిరించి మన పని చేసేలా నేను చేస్తాను కదా అని చెప్పి అజయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు…..

*******

కృష్ణమూర్తి ఆలోచించుకుంటూ నన్ను క్షమించమ్మా బుజ్జి చూడడానికి ఎంతో అమాయకురాలుగా ఉన్న నిన్ను ఆ బోనులో పంపడానికి గల కారణాలు చాలానే ఉన్నాయి ….

అర్జున్ నన్ను క్షమించరా మీ నాన్న ఒకరి కోసం మాత్రం చేయడం లేదు ఇది నేను చేస్తుంది మీ నాన్న కోసం విక్రమ్ ఆదిత్య వాళ్ళ నాన్న కోసం మీరందరూ కలిసిపోవాలి రా అదే నేను కోరుకునేది అది ఈ అమ్మాయి వల్లే సాధ్యమవుతుంది అని అనుకుని పడుకుంటాడు…….

******

If you like this episode please give comments guys…..