New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Villan – 5
Villan 8 min read

Villan – 5

 

మార్నింగ్ ఫ్రెష్ అయి బుజ్జి టెన్షన్ పడుతూనే కృష్ణమూర్తి గార కి కాల్ చేస్తుంది ఆయన ఎంతసేపైనా సరే బుజ్జి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు బుజ్జి టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది….

బుజ్జి టెన్షన్ గా దివ్య దగ్గరికి వచ్చి ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఎవరైతే నా డబ్బులు ఇచ్చారో ఆయన అసలు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని భయంగా అంటుంది

ఆయన ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి ఈ పని చేయడం నాకు కుదరదు అని చెప్పేయాలి…

అసలు ఎవరు పెద్దయిన నిన్ను ఇలా ఇరికించారు అసలు ఆయన తిట్టాలి ముందు ఆయన నెంబర్ నాకు ఇవ్వి నేను కనుక్కుంటాను అని అంటుంది సీరియస్ గా…దివ్య…

ఆయన ఏమీ అనకే అని చాలా మంచివారు చూడడానికి చాలా పెద్దాయన చాలా హుందాగా ఉన్నారు. ఆయన ఈ పనికి నన్ను ఇరికించాలి అని ఎందుకు అనుకుంటారు ఆయన కూడా తెలిసి ఉండకపోవచ్చు ముందు ఆయనతో మాట్లాడలే అని అంటుంది బుజ్జి….

పిచ్చిదానివి కాబట్టే నిన్ను అలా మోసం చేశారా ఆయన నాకు తెలుసు నిన్ను కావాలని ఇరికించి ఉంటారు. నేను అన్ని కనుక్కుంటాను కదా నువ్వు ఇంట్లోనే ఉండు సరేనా …

అజయ్ మెసేజ్ చేస్తే కనుక వస్తానని చెప్పు మాట్లాడదాం సరేనా అని చెప్పి దివ్య నెంబర్ తీసుకుని కాల్ చేద్దామని ఫోన్ తీసుకుంటుంది తన ఫోన్ నుండి చేస్తూ స్క్రీన్ మీద నెంబర్ చూసి షాక్ గురవుతుంది…..

దివ్య నోటిమాట రాకుండా నెంబర్ చూస్తూ నాన్న అని వస్తుంది ఏంటి…..

కంగారుగా దివ్య టెన్షన్ పడుతూ నాన్న బుజ్జితో ఎప్పుడు మాట్లాడారు బుజ్జికి డబ్బులు ఇవ్వడం ఏంటి? అంతా కన్ఫ్యూజన్ గా ఉంది అసలు ఆ ఊరు ఎందుకు వెళ్లారు అనుకుంటూ ఉంటుంది దివ్య……..

అసలు విషయం నాన్న అడిగి తెలుసుకోవాలి అని కంగారుగా దివ్య బుజ్జితో చెప్పి నేను ఇంటికి వెళ్లి వస్తానని ఇంట్లోనే ఉండు సరేనా అని చెప్పి కంగారుగా వెళ్ళిపోతుంది దివ్య….

దివ్య ఏంటి ? వెళ్ళిపోయింది ఫోన్ చేసి మాట్లాడుతానని చెప్పి ఏంటో అని కంగారుగా బుజ్జి టెన్షన్ పడుతూ గోర్లు గిల్లుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది…..

అమ్మో అజయ్ గారు నాకు ఈరోజు వరకే టైం ఇచ్చారు త్వరగా కనుక్కుంటే బాగున్ను అని టెన్షన్గా అనుకుంటూ ఉంటుంది బుజ్జి…..

****

 దివ్య ఇంట్లోకి వెళ్లి అమ్మ అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది….

దివ్య అరుపులకి దివ్య వాళ్ళ అమ్మ ఉలిక్కిపడి ఏంటి అంత గట్టిగా అరుస్తున్నావు నాన్న ఇంట్లో ఉన్నారు … నెమ్మదిగా మాట్లాడు ….

ఇప్పుడు నేను నెమ్మదిగా మాట్లాడే పరిస్థితిలో లేనమ్మా నాన్నగారు రూమ్ లో ఉన్నారా సరే నేను వెళ్తున్న అని చెప్పి వెళ్ళిపోతుంది

ఏమైంది దివ్యకి అంత కోపంగా వెళుతుంది వాళ్ళ నాన్న దగ్గరికి అని అనుకొని కుసుమ …

ఏంటో ఒక్కొక్కసారి అస్సలు అర్థం కాదు దివ్య అని అనుకుని కిచెన్లో వర్క్ ఉంటే చేసుకుంటూ ఉంటుంది కుసుమ …

అమ్మ దివ్య ఎలా ఉన్నావు ఇన్ని రోజుల పట్టిందా ఇంటికి రావడానికి….. ఆఫీస్ దూరం అని చెప్పి flat తీసుకుని దూరంగా ఉంటున్నావ్ మేమెంత మిస్ అవుతున్నామో తెలుసా అని నవ్వుతూ పలకరింపుగా మాట్లాడుతాడు కృష్ణమూర్తి…..

కృష్ణమూర్తి అంత ప్రేమగా మాట్లాడేసరికి దివ్య కోపం కాస్త ఎగిరిపోయి దగ్గరకు వచ్చి నాన్న మిమ్మల్ని ఒకటి అడగాలి అని అంటుంది బాధ నిండిన కళ్ళతో….

ఏంట్రా అంత బాధగా కనిపిస్తున్నావు ఏమైంది ఆఫీస్ లో ఏమైనా టెన్షన్ సరే వచ్చి కూర్చో అని చెప్పి ప్రేమగా మాట్లాడుతుంటాడు కృష్ణమూర్తి…..

చిన్నప్పటినుండి వాళ్ళ నాన్న వ్యక్తిత్వం అలాగే పెంచిన విలువలు తెలిసిన దివ్య వాళ్ళ నాన్నని ఏం అడగాలో అర్థం కాక మౌనంగా తలదించుకుని ఆలోచిస్తూ ఉంటుంది……

నేను పొరపాటుగా నంబర్ తీసుకున్నానా అసలు అడగాలా నాన్న వద్ద అనే ఆలోచిస్తూ దైలమాలో ఉంది దివ్య…..

దివ్య ప్రవర్తన విచిత్రంగా ఉండడంతో కృష్ణమూర్తి అసలు ఏమైంది చెప్పు ఏదైనా సరే నాతో పంచుకునే అంత స్వేచ్ఛ నీకు ఉంది కదా దివ్య చెప్పరా అని ప్రేమగా అడుగుతాడు….

నాన్న నా ఫ్రెండ్ ని నువ్వు కలిసావా …..

నీ ఫ్రెండ్ అంటే ఎవరు అని అడుగుతాడు ప్రశ్నార్థకంగా కృష్ణమూర్తి…..

ఇంకెవరు నాన్న నందిని అని అంటుంది బాధగా తన నాన్నని తనే ప్రశ్నించడం ఎందుకో ఇబ్బందిగా బాధపడుతూ దివ్య…..

నందిని అంటే నీ క్లాస్మేట్ కదా ఎప్పుడు తనని చూడలేదు రా ఇప్పుడు కొచ్చి అని అంటాడు కృష్ణమూర్తి క్యాజువల్గా….

కలిసావ్ నాన్న తనతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నావు నిజమా అని అడుగుతుంది…..

కృష్ణమూర్తి ఆలోచిస్తూ అసలు ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అగ్రిమెంట్ ఏంటి నీ ఫ్రెండ్ అని నేను కలవడం ఏంటి అసలు ఉన్నది చెప్పు అని అడుగుతాడు కృష్ణమూర్తి….

దివ్య ధైర్యం తెచ్చుకుని జరిగిందంతా కృష్ణమూర్తికి చెప్తుంది….

అంటే బుజ్జి నీ ఫ్రెండా అంటే నందిని బుజ్జి నా అడుగుతాడు ఆశ్చర్యంగా…

అవునన్నా నా ఫ్రెండ్ అని తెలియక …అగ్రిమెంట్ చేయించుకుని ఉండొచ్చు….

అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయండి నాన్న 40 లక్షలు తను జాబ్ చేసి అయినా తీరుస్తుంది అని అంటుంది బాధగా దివ్య…..

దివ్య …నువ్వు నందిని ఫ్రెండ్ అని చెప్పి ఊరట కలిగించావు ఇప్పుడు నా కోరిక తీరిపోతుంది అని ఆనందపడతాడు…..

నాన్న మీరు ఏం మాట్లాడుతున్నారు….అసలు బుజ్జి గురించి మీకు తెలియదు నాన్న చాలా అమాయకురాలు ఏదో డబ్బులు అవసరం ఉండి వాళ్ళ నాన్న ప్రాణాలు కాపాడుకోడానికి వాళ్ళ అక్క పెళ్లి జరగడానికి మీ దగ్గర money తీసుకుని ఉండొచ్చు కానీ ఇప్పుడు తన ప్రాణాలే రిస్క్ లో ఉన్నట్టు ఉన్నాయి నాన్న ప్లీజ్ అర్థం చేసుకోండి మీరు ఎందుకు ఇలా చేశారు అర్థం కావడం లేదు….

విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈవో విక్రం గారిని లవ్ చేయాలని చెప్పి కండిషన్ పెట్టారు నాన్న అజయ్…..

నాకు అన్నీ తెలుసు దివ్య నేను కావాలనే చేశాను నందిని ఈ పని చేయగలదు చేయాలి కూడా…

మీరు మూర్ఖంగా మాట్లాడకండి మీతో ఇలా మాట్లాడుతున్నందుకు కూడా నాకు ఇబ్బందిగా ఉంది ఒక ఆడపిల్ల జీవితం అర్థం చేసుకోండి అని అంటుంది దివ్య…

దివ్య జరిగిన గతం నీకు తెలియదు కాబట్టి నువ్వు అలా అనుకుంటున్నావు …..

 కొన్ని ఏళ్ళ క్రితం జరిగిందంతా దివ్యకి కృష్ణమూర్తి చెబుతాడు….

అది విన్న దివ్య కన్నీళ్లు పెట్టుకుంటూ ఏంటి నాన్న మీరు అంటుంది చాలా బాధగా ఉంది మీరు చెప్పిన తర్వాత దివ్య బాధపడుతూ ఉంటుంది…..

నేను వేరే ఒక అమ్మాయిని ఈ పనికొప్పించుంటే అసలు నేను అనుకున్నది జరుగుతుందా చెప్పు దివ్య అందుకే ఇలా చేశాను అలాగే మీ ఫ్రెండ్ జీవితం కూడా బాగుంటుంది అర్థం చేసుకో దివ్య ….

బుజ్జి ఫోన్ చేస్తుంటే మార్నింగ్ నుండి ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతున్నాను….కొంచెం బాధగా కృష్ణమూర్తి….

నాన్న మీరేం బాధపడకండి బుజ్జి నేను ఎలాగైనా ఒప్పిస్తాను అయినా బుజ్జికివన్నీ చెప్పినా తను భయపడిపోతుంది తప్ప చెయ్యదు సో ఎలా అయినా సరే బుజ్జి నొప్పించి ఏదో రకంగా మనం అనుకున్నది చేద్దాం నాన్న మీరు ఏం బాధపడకండి అని అంటుంది దివ్య…..

నాన్న మీరు చేస్తున్న పని మాత్రం నిజంగా చాలా గ్రేట్ నాన్న….

నీ స్నేహితులు బాగుండాలని వాళ్ళ కుటుంబాలు బాగుండాలని నువ్వు తీసుకుని నిర్ణయం మంచో చెడో ఎలా అయినా సరే బుజ్జి ద్వారా నెరవేరుతుంది అంటే సంతోషమే కదా నాన్న అని అంటుంది దివ్య……

సరే నాన్న తనని ఎలాగైనా ఒప్పించి భయపెట్టి అయినా సరే ఒప్పిదం అని అంటుంది దివ్య………

సరే నాన్న నేను వెళ్తాను బుజ్జి ఒకత్తే పాపం ప్లాట్ లో ఉంది ఎలా ఒప్పించాలో ఏంటో అని చెప్పి నన్ను క్షమించండి నాన్న తప్పు అర్థం చేసుకున్నాను….

అంత మన మంచికే జరిగింది దివ్యా నువ్వు నీ ఫ్రెండ్ కి తోడుగా ఉంటే అన్ని సక్రమంగా జరుగుతాయి…..

వెళ్ళొస్తాను నాన్న హడావిడిగా వెళ్ళిపోతుంది దివ్య….

దివ్య ఆగవే టిఫిన్ తిని వెళ్ళు….అని కుసుమ పిలిచిన పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది….

దివ్య ఏంటండీ ఈరోజు విచిత్రంగా ప్రవర్తించింది కోపంగా వచ్చింది ఇప్పుడు హడావిడిగా వెళ్ళిపోతుంది అని అడుగుతుంది కుసుమ అవన్నీ ఏమీ లేవు తర్వాత అన్ని వివరంగా చెప్తాను కదా నాకు ఆకలేస్తుంది ముందు నాకు టిఫిన్ పెట్టు అంటాడు ….కృష్ణమూర్తి…..

ఏంటో ఈ తండ్రీ కూతుర్లు ఏం మాట్లాడుకున్నారు ఏమో ఏమి చెప్పరు నాకు అస్సలు అర్థం కారు అని చెప్పి గొనుక్కుంటూ నే టిఫిన్ పెడుతుంది కుసుమ…..

*****

దివ్య వెళ్లేదారిలో అసలు ఎలా ఒప్పించాలి బుజ్జి ని అని ఆలోచించుకుంటూనే ఉంటుంది…..

ఇంటికి రాగానే బుజ్జి ఏమైంది కృష్ణమూర్తిగారిని కలిసావా మాట్లాడావా అసలు ఏం జరిగింది అని అడుగుతుంది ఆతృతగా….

నువ్వు టెన్షన్ ఏం తీసుకోకు బుజ్జి ముందు నేను చెప్పేది నిదానంగా విను అని చెప్పి కూర్చోబెట్టి….

తప్పదు బుజ్జి నువ్వు ఈ పని చేయాల్సిందే అని అంటుంది….

ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు నేను ఈ పని చచ్చిన చేయను చెప్పాను కదా ఎలా అయినా 40 లక్షల కడతాను అంతే తప్ప నేను చేయలేను అర్థం చేసుకోవే అని ఏడుపు మొహంతో అంటుంది….

బుజ్జి ఫేస్ చూసి జాలి కలిగి …..నేను చెప్పేది వినవే ఇప్పుడు గాని ఒప్పుకోకపోతే వాళ్ళ పెద్ద మనుషులు నిన్ను ఎలా అయినా సరే ఇరికిస్తారు మీ ఇంట్లో వాళ్ళు ప్రాణాలు కూడా తీసేసారు అర్థం చేసుకుని కొన్ని రోజులు నటించవే నీవల్ల కావడం లేదు అని తప్పించుకుందాం ఏమంటావ్…..

ఏమంటున్నావ్ నాకేం అర్థం కావడం లేదు అని అంటుంది ఏడపు మొహం తో బుజ్జి……

చూడు తెలివిగా ఆలోచించవే చేస్తానని ఒప్పుకో తర్వాత కొన్ని రోజులు నీవల్ల కావడం లేదు నువ్వు చేయలేకపోతున్నావని వాళ్ళ విసుక్కుంటారు తర్వాత నువ్వు మెల్లిగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దాం. సరేనా అని అంటుంది….

ఏమోనే నువ్వు ఏదేదో చెప్తున్నావ్ నాకు చాలా భయంగా ఉంది కానీ ఇప్పటికిప్పుడు డబ్బులతో వ్యవహారం కాబట్టి నువ్వు చెప్పింది కూడా నిజమే సరే ఒప్పుకోకా.. చస్తానా చెప్పు

… ఏదో ఒకటి చేయాలి అని ఆలోచించుకుంటూ సరే అన్నట్టు తల ఊపుతుంది…..

అజయ్ ఉన్నారు కదా ఆయన చాలాసార్లు కాల్ చేశారే ఒప్పుకున్నారా లేదా అని భయంతో నేను ఆయనతో మాట్లాడలేదు కొంచెం ఆయనతో కూడా నువ్వు మాట్లాడవే ప్లీజ్ అంటుంది బుజ్జి….

సరే నీ ఫోన్ ఇవ్వు నేను మాట్లాడుతాను అని చెప్పి దివ్య తీసుకుని …కాల్ చేస్తుంది….

హలో అజయ్ గారు మాట్లాడేది అని అంటుంది. 

అవును ఏంటి ఎంతసేపైనా సరే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు మా పని ఒప్పుకుంటున్నారా లేదా అని అడుగుతాడు ఒప్పుకోకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో చెప్పమంటారా అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడాతారు….

సర్ కొంచెం కోపం తగ్గించుకుని మర్యాదగా మాట్లాడండి వెంటనే ఒప్పుకోవడానికి ఇది లైఫ్ సంబంధించిన మ్యాటర్ సార్ తన పరువు కూడా సంబంధించింది….

అసలే వాళ్ళు ఫ్యామిలీ చాలా పెద్ద కుటుంబం అర్థమవుతుందా సార్ తను ఈ పని చేయడానికి ఒప్పుకుంది అంటే చాలా చాలా నరకం అనుభవించి ఒప్పుకుంటుంది. నేను చాలా కష్టపడి ఒప్పించాను అని అంటుంది దివ్య…..

తను ఎలా ఒప్పుకుంటే మాకేంటి మొత్తానికి ఒప్పుకుంది ఒప్పుకోకపోతే ఏం చేయాలో ఆల్రెడీ ఆలోచించి పెట్టుకున్నాను కూడా……

 ఒప్పుకుంది….. కాబట్టి బతికిపోయారు

 సరే ఈ విషయం నీకు కూడా తెలుసు కాబట్టి నువ్వు కూడా ఎక్కడ చెప్పకు అలాగే నీ ఫ్రెండ్ రేపటినుండి స్టార్ట్ చేయాల్సిందే అర్థమవుతుందా ఎలా చేయాలి ఏం చేయాలి ప్రతిదీ కూడా నేను మీకు మెసేజ్ చేస్తూ ఉంటాను. నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిపోండి ….

సరే ఇంకో విషయం ఏంటంటే మీ ఫ్రెండ్ నేను డైరెక్ట్ గా మాట్లాడలేను ఎందుకంటే ప్రాబ్లం అవుతుంది తను నేను మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే మన ప్లాన్ లీక్ అవుతుంది నువ్వు నేను కలిసి మాట్లాడుకుందాం అంటాడు అజయ్…..

మీరు ఎలాగో ఫోన్లో మాట్లాడుతారు కదా సార్ ఇంకెందుకు మిమ్మల్ని మేము కలవాలి మేము చూసుకుంటాం లే అని అంటుంది దివ్య…..

కొన్ని కొన్ని విషయాలు మాట్లాడవలసి వస్తాయి అర్థమవుతుందా దివ్య అండ్ మోర్ ఓవర్ మీతో మాట్లాడి టైం వేస్ట్ చేయడం కూడా నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు అని అంటాడు…

.ఇది మా ఫ్రెండ్స్ సెక్యూరిటీ పర్పస్ కోసం మీతో మాట్లాడుతున్నాను తప్ప నాకు మీతో మాట్లాడాలంటే చిరాగ్గా ఉంది అని అంటుంది దివ్య కూడా….

చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్ నేనెవరో తెలుసు కదా అని అంటాడు సీరియస్ గా ….

తెలుసు సార్…. సారీ సార్ అని అంటుంది వెటకారంగా….

 తిక్క తిక్కగా మాట్లాడి నాకు కోపం తెప్పించకు దివ్య సరే నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఏం చేయాలో ఫాలో అవ్వండి సరే నా అని చెప్పి phone పెట్టేస్తాడు….అజయ్….

పాపం బుజ్జి రేపు నుండి ఏం చేస్తుందో ఏంటో అని అనుకుంటుంది….

బుజ్జి టెన్షన్ గా ఆలోచించుకుంటూ ఇష్టం లేని ఒక వ్యక్తిని ప్రేమించినట్టు నటించాలి ఇష్టం లేని బావ ని పెళ్లి చేసుకోవాలి ఏంటో నా జీవితం అని బాధపడుతూ ఉంటుంది…..