New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Villan – 3
Villan 7 min read

Villan – 3

గేట్ సౌండ్ వినిపించడంతో బయటికి వస్తుంది శైలజ పరిగెత్తుకుంటూ……

అక్క అంటూ ఏడుస్తూ బుజ్జి వచ్చి శైలజ ని కౌగిలించుకుంటుంది…..

 శైలు కంగారుపడుతూ నాన్నగారికి ఎలా ఉంది బుజ్జి. నేను వద్దామనుకున్న హాస్పిటల్ కి కానీ పెళ్లికూతురు చేసిన తర్వాత ఊరు దాటకూడదంట కదా అందుకనే రాలేకపోయాను అని అంటుంది బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ శైలు…..

నాన్నగారు బాగానే ఉన్నారు అక్క heart స్టంట్ వేశారు చిన్న ఆపరేషన్ పర్లేదు టుడేస్ లో మనిషి మామూలుగానే కూర్చుంటారని డాక్టర్ చెప్పారు నువ్వు కన్నీళ్లు తుడుచుకో ముందు అని అంటుంది వాళ్ళ అక్కకి ధైర్యం చెబుతూ బుజ్జి……

శైలు కళ్ళు తుడుచుకుని అమ్మ నాన్న గారి దగ్గరే ఉందా అని అడుగుతుంది…..

అవును అక్కా అమ్మ నాన్నగారి దగ్గరే ఉంది అలాగే డబ్బులు కూడా అన్ని అరేంజ్ చేసేసాను. నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు నీ పెళ్లి కూడా జరిగిపోతుంది అని నవ్వుతూ చెప్తుంది బుజ్జి……

డబ్బులు నువ్వు అరేంజ్ చేసావా అసలు నీకు ఎవరు ఇచ్చారు అని అనుమానం అడుగుతుంది….శైలు…

బుజ్జి తడబడుతూ అంటే అక్క నేనేం arrange చేయలేదు అంత దామోదర్ మావయ్య చూసుకుంటున్నారు అని అంటుంది…..బుజ్జి…..

ఏంటి దామోదర్ మావయ్య అరేంజ్ చేస్తారా నన్ను నమ్మమంటావా అసలు నమ్మడానికి వీలైనట్టుగా ఉంది నువ్వు చెప్పేది ఎందుకంటే మావయ్య ఎంత పిసినారో నాకు తెలుసు కదా అని అంటుంది శైలు…..

అక్క ఆపదలో ఉంటే ఎవరైనా సహాయం చేస్తారు కదా సొంత మావయ్య చేయకుండా ఉంటారా చెప్పు అని అంటుంది బుజ్జి…..

చేస్తారే నేను కాదనను కాకపోతే ఏదో పది లక్షల అరెంజ్ చేయడం అలా చేస్తారు అంతేగాని నా పెళ్లికి అయ్యే 30 లక్షలు కూడా అరేంజ్ చేస్తారు అంటేనే నమ్మబుద్ధి కావడం లేదు అని అంటుంది నిజం చెప్పవే నువ్వేదో ఏదో నిజం దాస్తున్నావు కదా నాకు నీ గురించి తెలుసు కదా నువ్వు అబద్దం చెప్తున్నావు అని నీ కళ్ళు చూస్తే తెలుస్తుంది…..అని అంటుంది ….బుజ్జి….

అబ్బా నేను చెప్పింది నిజమే అక్క నువ్వు ఏమి ఆలోచించకు అని అంటుంది బుజ్జి …

అనుమానం ఆలోచిస్తూ ఉంది ఇంకా అక్క … నా .మాట నమ్మలేదు అనుకుంటా అని బుజ్జి ఆలోచించి

నాకు ఆకలి వేస్తుంది అని చెప్పి లోపలికి తీసుకెళ్తుంది బలవంతంగా శైలు చేయి పట్టుకుని బుజ్జి…..

 బుజ్జి ఎంత చెప్పినా నమ్మకం కుదరడం లేదు నాకు…. మళ్ళీ ఏం ప్రాబ్లం దానిమీద వేసుకుంటుందో…. ఏంటో అని భయపడుతూనే ఆలోచిస్తూనే లోపలికి వెళ్తుంది శైలు….

రెండు రోజుల తర్వాత బుజ్జి వాళ్ళ నాన్న డిశ్చార్జ్ అవుతారు…..

డబ్బులు ఇంట్లోనే ఉన్నాయి ఎక్కడో పెట్టి మేము మర్చిపోయాం తర్వాత దొరికాయి అని నెమ్మదిగా రాఘవయ్య గారు అదే బుజ్జి వాళ్ళ నాన్నకి చెప్తారు….

అనుకున్నట్టుగానే డబ్బులు అన్ని అరేంజ్ చేసి బుజ్జి వాళ్ళ అక్క పెళ్లి కూడా చేస్తుంది…..

శాంతి కి బుజ్జి మీద కోపం అలానే ఉండిపోతుంది…..

కృష్ణమూర్తి గారు చెప్పిన పని చేయడానికి బుజ్జి ఊరు బయలుదేరుతున్న రోజు……

ఊరు కావాల్సిన అన్ని సర్దుకుంటూ ఉంటే శాంతి బుజ్జి దగ్గరకు వస్తుంది….

ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడుగుతుంది భయపడుతూనే బుజ్జి….

బుజ్జి నువ్వు ఊరు వెళుతున్నట్టే నేను ఆపడానికి రాలేదు కేవలం నీకు జాగ్రత్తలు చెప్పడానికి మాత్రమే వచ్చాను అని అంటుంది శాంతి….

ఎందుకమ్మా అంత కోపం నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను కదా నువ్వు చెప్పినట్టే దామోదర్ మావయ్య కొడుకు వెంకట్ ని పెళ్లి చేసుకొవడానికి ఒప్పుకున్నాను కదా ఇంక నా మీద నీకు కోపం పోలేదా….

ఎందుకు పోతుంది జన్మలో పోదు నువ్వు చేసింది చిన్న తప్ప నాలుబై లక్షలు ఊరికి నే పోగొట్టావ్…..

నాన్నగారి ప్రాణం మీద తీసుకొచ్చావు ….. నువ్వు చేసిన తప్పు చెప్తే మీ నాన్నగారి ప్రాణం పోతాయని చెప్పకుండా ఆగిపోయాను నీ వల్ల అబద్ధం కూడా చెప్పవలసి వచ్చింది నేను….. కోపంగా అంటుంది శాంతి……

అసలు నిన్ను డబ్బు తీసుకురమ్మని బ్యాంకు పంపించి తప్పు చేశాను అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావ్ అని తిడుతూ ఉంటుంది….

అయ్యో నేను కావాలని చేయలేదు అమ్మ రోడ్డు మీద ఎవరో కళ్ళు తిరిగి పడిపోతే బ్యాగ్ చేతిలోది జస్ట్ పక్కకు పెట్టాను అంతే అంతలోకి ఎవరో వ్యక్తి వచ్చి తీసుకెళ్ళిపోయాడు అమ్మ ఆల్రెడీ వాళ్ళ ఫేస్ కూడా చూసాను అమ్మ పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని అంటుంది….బుజ్జి……

నేను డబ్బులు డ్రా చేస్తున్నానని ముందుగానే ఎవరు గమనించారు …..కావాలని చేశారేమో అని డౌట్ గా ఉందమ్మా….. అంటుంది….బుజ్జి……….

పోలీస్ కంప్లైంట్ అంతా మీ మావయ్య చూసుకుంటున్నారు లే ఎలాగైనా డబ్బులు వస్తే మీ మామయ్యకి ఇచ్చేయాలి. అలాగే మావయ్యకి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు వెంకట్ పెళ్లి చేసుకోవాలి. …. ….

అసలు నిన్ను పంపించడం నాకు ఇష్టం లేదు ఎలాగో వెంకట రావడానికి ఆరు నెలలు టైం ఉంది కాబట్టి నువ్వు 6 నెలలు ఉద్యోగం చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నాను. నీ ఫ్రెండ్ దివ్య వాళ్ళ ఇంట్లో ఉండు అర్థమైందా అని అంటుంది శాంతి…..

ఒకసారి నీ ఫ్రెండ్ దివ్య ఫోన్ చెయ్ మాట్లాడుతాను …..

సరే అమ్మ అని అంటుంది భయంగా బుజ్జి …

దివ్య ఫోన్ చేసి ఇస్తుంది బుజ్జి. 

దివ్య ఫోన్ లిఫ్ట్ చేసి ఆంటీ చెప్పండి అని అంటుంది …..

చూడమ్మా దివ్య నిన్ను నమ్మి నేను నా కూతురు అక్కడ పంపిస్తున్నాను కొంచెం జాగ్రత్తగా చూసుకో అసలు ఇది తింగరిది మిస్టేక్స్ చేస్తూ ఉంటుంది అని చెప్తుంది శాంతి…

అయ్యో ఆంటీ మీరు ఇంతలా చెప్పవలసిన అవసరం లేదు ….బుజ్జి బాధ్యత నాది మీరేం టెన్షన్ పడకండి ఆంటీ బాగా చూసుకుంటాను కదా అని అంటుంది దివ్య…….

నేను దివ్య దగ్గరికి వెళ్లడం లేదని అమ్మకు తెలిస్తే ఏమవుతుందో ఏంటో అని భయంగా అనుకుంటుంది మనసులో బుజ్జి….

నెక్స్ట్ రోజు బుజ్జి హైదరాబాద్ బయలుదేరుతుంది….

ముందుగా దివ్య దగ్గరికి వెళ్తుంది బుజ్జి….

జరిగిన అంతా దివ్య వివరిస్తుంది బుజ్జి…..

నువ్వు చెప్తుంది వింటుంటే చెమటలు పడుతున్నాయి అసలు ఏం చేయాలనుకుంటున్నావు ఆరు నెలలో మీ ఇంట్లో వాళ్ళు కి తెలియకుండా నీకు డబ్బులు సహాయం చేసిన వ్యక్తికి సహాయం చేయాలని వాళ్ళ దగ్గర ఉండాలి అనుకుంటున్నావా….

అసలు 40 లక్షలు ఇచ్చే అంత అవసరం నీతో ఏముంటుంది ఒక ఆడపిల్లవి నాకు భయంగా ఉంది అని అంటుంది దివ్య….

అదే నాకు అర్థం కాలేదు కృష్ణమూర్తిగారిని చూస్తే మంచి వాళ్ళ లాగా కనిపిస్తున్నారు కానీ ఆ 40 లక్షలు అసలు ఎందుకు ఇచ్చారో నేను చేయవలసిన పని ఏంటో పూర్తిగా చెప్పలేదు హైదరాబాద్ వెళ్తే చెప్తానన్నారు డాక్యుమెంట్ మీద కూడా సైన్ చేసానే అని అంటుంది భయంగా బుజ్జి….

ఏదో ఒక రకంగా లోన్ తీసుకునో ఏదోటి చేసో 40 లక్షల కృష్ణమూర్తి గారికి ఇచ్చేవే నువ్వు ఈ పని చెయ్యొద్దు…..ఇది రిస్క్ పనిలా ఉంది తింగరి దానిలాగా నమ్మొద్దు అని అంటుంది 

ఏమో నువ్వంటూ ఉంటేనే నాకు చాలా దడగా ఉంది అని అంటుంది బుజ్జి భయపడుతూ….. ఎలాంటి పనో నాకు తెలీదు గానీ మా నాన్న ప్రాణాలు అక్క పెళ్లి జరిగింది కాబట్టి మా ఫ్యామిలీ ఈరోజు సంతోషంగా ఉంది అని అంటుంది బుజ్జి…..

అందుకోసం నీ లైఫ్ risk పెట్టుకోవడం మంచిది కాదే అని అంటుంది భయంగా దివ్య…. ఆలోచించుకో ఇదంతా తప్పు అనిపిస్తుంది అని అంటుంది దివ్య….

నువ్వు భయపడుతుంటే ఇంకా భయమేస్తుంది కృష్ణమూర్తి అంకుల్తో వివరంగా వివరాలు తెలుసుకుని అప్పుడు ముందుకు వెళ్తాను సరేనా రేపు ఆయన మీట్ అవ్వాలనుకుంటున్నాను హైదరాబాదులో కలుద్దామన్నారు…

సరే రేపు నువ్వు నాతోపాటు రావే దివ్యా నాకు భయంగా ఉంది అని అంటుంది బుజ్జి ఏడుపు మొహం పెట్టుకుని……

వస్తాను ….. ఒంటరిగా నిన్ను పంపిస్తాను అని ఎలా అనుకున్నావ్ అసలే అమాయకురాలివి ….నేను వస్తాను తోడుగా సరేనా నీకు మెసేజ్ చేస్తారని చెప్పావు కదా ఆ టైం కి ఇద్దరం కలిసి వెళ్దాం…..

మరుసటి రోజు దివ్య అలాగే బుజ్జి ఇద్దరు కలిసి వాళ్ళకి పంపిన అడ్రస్ కి వెళ్తారు……

ఒక రెస్టారెంట్లో కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటారు…..

వాళ్లకు రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర కూర్చున్న దివ్య అలాగే బుజ్జి దగ్గరికి అజయ్ వస్తాడు……..

 అజయ్ ని చూసి షాక్ అవుతుంది బుజ్జి మీరు ఎవరు అండి కృష్ణమూర్తిగారు వస్తారు….అనుకుంటే మీరు వచ్చి కూర్చున్నారు కృష్ణమూర్తిగారు రాలేదా అని అడుగుతుంది అమాయకంగా బుజ్జి….

కృష్ణమూర్తి గారు నా దగ్గర పనిచేసే మనిషి మీరు చేయవలసిన పని నాతో ముడిపడింది అందుకే నేను వచ్చాను అని అంటాడు అజయ్ కోపంగా వాళ్ళిద్దరు వైపు చూస్తూ మాట్లాడుతూ….

ఈ మనిషి ఏంటి అంత సీరియస్ గా చూస్తున్నారు దివ్య ఆలోచిస్తూ ఉంటుంది…..

నిజంగానే కృష్ణ మూర్తి గారు పంపించిన వ్యక్తి మీరేనా అని అనుమానం అడుగుతుంది దివ్య…..

మీ అనుమానాలు తీర్చడానికి రాలేదు ఇక్కడికి నేను ఇక్కడికి వచ్చింది 40 లక్షలు మా దగ్గర తీసుకుని అగ్రిమెంట్ చేసిన అమ్మాయి కోసం ఇద్దరి లో ఎవరు మనీ తీసుకుంది అని అడుగుతాడు సీరియస్గా……..అజయ్….

నేనేనండి అని చెప్తుంది బుజ్జి అమాయకంగా చూస్తూ…..

ఓకే గుడ్. మీకు చేయవలసిన పని ఏంటో డీటెయిల్స్ ఏంటి నేను పూర్తిగా చెప్తాను ….. అలాగే మీరు తప్పకుండా పని చేసి పెట్టాలి లేదంటే అమౌంట్ double pay చేయాల్సి వస్తుంది అని అంటారు సీరియస్ అజయ్…..

ముందు పని ఏంటో చెప్తే దాన్ని బట్టి మేము ఆలోచించుకొని చెప్తాము అని అంటుంది దివ్య పొగరుగా…..

అసలు ఏమనుకుంటున్నారు మీరు? పొగరు చూపిస్తున్నారు అసలు మీరు పని చేస్తారా లేదా లేకపోతే డబ్బులు కడతారా చెప్పండి అసలు టైం కూడా లేదు నాకు కోపంగా అంటాడు అజయ్……

అయ్యయ్యో అలా అనకండి మా దగ్గర డబ్బులు లేవు డబ్బులు అంటే 80 లక్షల పే చేయడం మా వల్ల కాదండి ఏదో కంగారులో సైన్ చేసేసాను కానీ ఇప్పుడు ఆలోచిస్తే భయంగా ఉంది అని అంటుంది బుజ్జి….

అవన్నీ మీరు ముందు ఆలోచించుకోవాలి దిగిన తర్వాత కాదు ఎట్టి పరిస్థితులను పని చేయాల్సిందే లేదంటే మీరు పోలీస్ స్టేషన్ లో ఉండాల్సి వస్తుంది….

మీరు మా దగ్గర డబ్బులు తీసుకుని కట్టలేదని చెప్పి పోలీస్ కంప్లైంట్ రైస్ చేస్తాను ఎన్ని విధాలకు మిమ్మల్ని నాశనం చేయాలో అన్ని విధాలుగా చేయగల క్యాపబిలిటీ ఉన్న వాడిని అని అంటడు అజయ్ పొగరుగా….

ఆ మాటలు వింటున్న బుజ్జికి shivering వచ్చేసి భయపడుతూ చెమటలు పడుతూ ఉంటాయి……

చూడండి నాకు మీతో వాదించే అంత టైం లేదు నేను చెప్పాల్సిన డీటెయిల్స్ చెప్తాను మీరు రేపు నుండి పని చేయాల్సి ఉంటుంది అలాగే నేను మిమ్మల్ని కలిసినట్టు ఎవరికీ తెలియకూడదు ఇవన్నీ సీక్రెట్ గా ఉంచాలి. అసలు మీ ఫ్రెండ్ తీసుకురడమే మీరు చేసిన తప్పు కాకపోతే ఒక ఆడపిల్లగా మీకు భయాలు ఉంటాయి కాబట్టి నేను అర్థం చేసుకోగలను అని అంటాడు అజయ్….

సరే పని ఏమిటంటే మీరు ఒక వ్యక్తిని ప్రేమించాలి ప్రేమించినట్టు నటించాలి….

మీరు మూడు విధాలుగా అతని నాశనం చేయాలి

 ఫస్ట్ :ఆర్థికంగా 

రెండు: కుటుంబ పరంగా 

మూడు: వ్యక్తిగత పరంగా నాశనం చేయాలి….

అవి వింటున్నా దివ్యకి బుజ్జికి కళ్ళు తిరుగుతూ ఉంటుంది ఏంటి ఒక వ్యక్తిని ప్రేమించినట్టు నటించాలా అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేస్తుంది బుజ్జి……

సరే నాకు మీటింగ్ ఉంది నేను అర్జెంటుగా వెళ్లాలి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్ లో ఉన్నాయి ఈ ఫైల్ చూసుకొని మీ నిర్ణయం ఏంటో చెప్పండి మీరు 80 లక్షలు పే చేస్తారా లేకపోతే నేను చెప్పింది చేస్తాను అన్నది మీ ఇష్టం. మీకు రేపటి వరకు టైం అని చెప్పి అజయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు……

బుజ్జి అలాగే దివ్య షాక్ లోనే ఫైల్ తీసుకుని ఆశ్చర్యంగా అలానే ఉండిపోతారు………

@@@@@

Next episode will come tomorrow……please give comments guys