New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అజేయ – 109
అజేయ Premium 6 min read

అజేయ – 109

       **  అజేయ -109 **

 

​గుహలోని నీలి కాంతి దీపాలు ఒక్కటొక్కటిగా పగిలిపోతున్నాయి. శతాబ్దాలుగా గుహను మోస్తున్న భారీ రాతి స్తంభాలు దెబ్బతిని, నేలమట్టం కావడానికి సిద్ధమయ్యాయి..

 

భూమి నిలువునా చీలిపోతున్నట్లుగా నేలపై పెద్ద పెద్ద క్రాక్స్ ఏర్పడి, స్వర్ణ అగ్నిజ్వాలలు బయటకు చిమ్మడం మొదలైంది!

 

​”రాఘవ్! గుహ కూలిపోతోంది! ఏమో ” అని అంటున్నా సియా భయంతో రాఘవ్ భుజాన్ని గట్టిగా పట్టుకుంది..

 

అజేయ ఖడ్గం అసలు యాజమానదారుడికి అందిన తరువాత ఆ మహా కాల గుహ తన రహస్యాలు మళ్లీ ఏ మానవుడి చేతికి చిక్కకూడదనే నియమంతో… తనను తాను సంపూర్ణంగా సమాధి చేసుకోవడానికి సిద్ధమవుతోంది!

 

పైనుంచి పడుతున్న భారీ రాళ్ల ధాటికి గుహ అంతటా దట్టమైన రాతి ధూళి, పొగ అలుముకున్నాయి. ప్రశాంతంగా ఉన్న గుహ ఇప్పుడు ఒక మృత్యుకూపంగా మారిపోయింది!

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue