New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా చిలిపి బావ – 21

నా చిలిపి బావ – 21

అంతే అంటావా? 

 

అంతే…నా కూతురే కదా అని అక్కకి కూడా ఫోన్ చేయకు…. చేసినా బాగోగులు గురించి అడుగు అంతే గాని సరిగ్గా చూసుకుంటున్నారా? అత్త నీతో ఏమైనా కోపంగా ప్రవర్తిస్తుందా? ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడకు….

 

పరిమళ కొడుకు మాటకి సరే అని చెప్పింది….

 

*******************

 

ఒసేయ్ దున్నపోతా!!! పెద్ద కలెక్టర్ గిరి వెలగబెడుతున్నట్టు జాబు జాబు అని కలవరించావు… వాడెవడో అమాయకుడు తమరి బద్దకం గురించి తెలియక ఉద్యోగం ఇస్తే దున్నపోతులాగా 8:00 అవుతున్న ఇంకా లేవలేదు…. మరొక గంటలో ఆఫీసులో లేకపోతే మొదటి రోజే లేటుగా వచ్చినందుకు తల వాచిపోయేలా తిడతారని కోపంగా అంది సత్యవతి…..

 

అప్పుడు ఆఫీస్ కి వెళ్లాలని జ్ఞాపకం రావడంతో ఒక్కసారిగా లేచి కూర్చుని టైం అయిపోయిందని బాత్రూం లోకి పరుగులు పెట్టడంతో తల కొట్టుకుంటూ వెళ్లిపోయింది సత్యవతి…..

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue