** అజేయ -106 **
అతడి కంటిచూపు నేలపై పడి ఉన్న రైఫైల్ మీద పడింది!
అతడి ముంజేతులు పని చేయడం లేదు,
వేళ్లు ముడవడానికి కూడా వీల్లేని స్థితిలో స్తంభించిపోయాయి. కానీ విక్రమ్ తన సర్వశక్తినీ, క్రోధాన్ని కూడగట్టుకుని…
కాలిపోయిన తన రెండు అరచేతుల మధ్య ఆ గన్ నీ నలిపి పట్టుకున్నాడు.. మెల్లిగా మోకాళ్లపై నిలబడటానికి ప్రయత్నిస్తూ, తీవ్రమైన వేదనతో కూడుకున్న గర్జన చేస్తూ పక్కనే వున్నా రాతి స్తంభం నీ ఆసరాగా చేసుకుని లేచి నిలబడ్డాడు!
విక్రమ్ ఎలాగోలా గన్ సేఫ్టీ క్యాచ్‌ను వెనక్కి లాగి.. రాఘవ్ మరియు సియాలా వైపు చూసాడు..
రాఘవ్, సియాలు పీఠం వైపు అడుగులు వేయబోతున్న ఆ క్షణంలో… వెనుక నుంచి విక్రమ్ వికృతమైన, పిచ్చి నవ్వు ఆ గుహ అంతటా ప్రతిధ్వనించింది!